తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

జాక్వెలిన్​పై బాలీవుడ్ నటి రూ.200 కోట్ల పరువు నష్టం దావా - జాక్వెలిన్‌ మనిలాండరింగ్​ కేసు

బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌పై మరో నటి నోరా ఫతేహీ రూ.200కోట్ల పరువునష్టం దావా వేసింది.

Nora Fatehi
జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌

By

Published : Dec 12, 2022, 8:39 PM IST

Nora Fatehi Jacqueline Fernandez: బాలీవుడ్‌ నటి నోరా ఫతేహీ.. తన సహనటి జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌పై 200కోట్ల రూపాయల పరువునష్టం దావా వేసింది. జాక్వెలిన్‌ దురుద్దేశంతోనే తనపై తప్పుడు ఆరోపణలు చేసినట్లు నోరాఫతేహీ ఆరోపించింది. నోరా ఆరోపణలపై జాక్వెలిన్‌ నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు.

వీరిద్దరికీ.. రూ.200 కోట్ల మనీలాండరింగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సుకేశ్‌ చంద్రశేఖర్‌తో సంబంధాలున్నట్లు గతంలో ఈడీ గుర్తించింది. సుకేశ్‌ వీరిద్దరికీ ఖరీదైన వస్తువులు బహుమతులుగా ఇచ్చినట్లు నిర్ధరించింది. ఇప్పుడు నోరా.. జాక్వెలిన్‌పై ఏకంగా రూ. 200కోట్ల పరువు నష్టం దావా వేయడం చర్చనీయాంశం అవుతోంది.

ABOUT THE AUTHOR

...view details