తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

20ఏళ్ల వయసు తగ్గనున్న నితిన్‌.. కొత్త సినిమా కోసం భారీ ప్రయోగం.. వర్కౌట్​ అవుతుందా?

Nithin Venky Kudumula Movie : తన కెరీర్​లో బ్లాక్​ బస్టర్​ హిట్​ ఇచ్చిన.. డైరెక్టర్​ వెంకీ కుడుములతో హీరో నితిన్​ మళ్లీ చేతులు కలపబోతున్నారు. అయితే ఈ సినిమాలో నితిన్​ 21 ఏళ్ల కుర్రాడిలా కనిపించబోతున్నారట. అందుకు రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఆ సంగతులు...

nithin-venky-kudumula-movie-
nithin-venky-kudumula-movie-

By

Published : Aug 7, 2023, 7:56 PM IST

Nithin Venky Kudumula Movie : ఎక్స్​ట్రా ఆర్డినరీ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు హీరో నితిన్​. ఈ సినిమాపై మూవీ లవర్స్‌ మంచి ఎక్స్‌పెక్టేషన్సే ఉన్నాయి. డిసెంబర్‌ చివరి వారంలో రిలీజ్‌ కాబోతున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత నితిన్‌.. తన కెరీర్‌లో బ్లాక్‌బస్టర్‌ ఇచ్చిన వెంకీ కుడుములతో మరోసారి చేతులు కలుపుతున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్‌ పనులు కూడా తుది దశకు చేరుకున్నాయి. రేపో మాపో సెట్స్‌ మీదకు కూడా వెళ్లనుంది.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఈ సినిమాలో నితిన్‌ యంగ్‌ లుక్‌లో కనుపించనున్నారని టాక్​. వెంకీ ఈ సినిమా కోసం ఓ సాలిడ్‌ ఫ్లాష్ బ్యాక్‌ ఎపిసోడ్‌ను రాసుకున్నారట. అందులో 21ఏళ్ల కుర్రాడిలా నితిన్‌ను చూపించనున్నారట. వీఎఫ్‌ఎక్స్‌ సహాయంతో నితిన్‌ను కుర్రాడిలా సహజంగా చూపించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారట.

నలభై ఏళ్లున్న నితిన్‌ను దాదాపు 20ఏళ్లు తగ్గించి చూపడం అనేది కత్తి మీద సామే. పైగా వీఎఫ్‌ఎక్స్‌ అంటున్నారు కాబట్టి ఏ మాత్రం తేడా కొట్టినా చిత్రయూనిట్‌ ట్రోలర్ల టార్గెట్‌ అవడం ఖాయం. ఈ సినిమా కథ.. ఒక అరుదైన వ్యాధి వల్ల నెలరోజుల్లో చనిపోతానని తెలిసిన ఒక అబ్బాయి.. ఆ నెల రోజులు తన జీవితాన్ని ఎలా గడిపాడు? తన జీవితానికి దక్కిన ముగింపేంటి? అనే నేపథ్యంలో సాగుతుందని సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే పట్టాలెక్కనుంది. నిజానికి వెంకీ తన తదుపరి సినిమాను చిరుతో చేయాల్సిఉంది. అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ కూడా వచ్చేసింది. కానీ పలు కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్‌ రద్దైంది.

Nithin Movie Career : హీరో నితిన్​.. సుమారు 7ఏళ్ల తర్వాత.. ఇష్క్​ సినిమాతో తిరుగులేని కమ్​బ్యాక్​ ఇచ్చారు. ఆ సినిమా తర్వాత ఈ కుర్ర హీరో.. కెరీర్​ మంచి స్పీడ్​ అందుకుంది. ఇష్క్​ తర్వాత.. గుండెజారి గల్లంతయ్యిందే, హార్ట్​ ఎటాక్​ సినిమాలు కూడా హిట్​ కావడం వల్ల నితిన్​ మార్కెట్​ మరింత పెరిగిపోయింది. ఆ తర్వాత మళ్లీ రెండు మూవీలు ఫ్లాప్​ అయినా.. 'అఆ'తో హిట్​ ట్రాక్​ ఎక్కేశారు.

అయితే ఈ సినిమా అనుకున్న దానికంటే భారీ విజయం సాధించడంతో నితిన్‌పై ప్రేక్షకుల్లో ఓ రేంజ్‌లో ఎక్స్‌పెక్టేషన్స్‌ పెరిగిపోయాయి. దాంతో ఆ తర్వాత నితిన్‌ నటించిన సినిమాలు ప్రేక్షకుల ఎక్స్‌పెక్టేషన్స్‌కు రీచ్‌ అవ్వలేక వరుస డిజాస్టర్‌లు మూటగట్టుకున్నారు. మధ్యలో భీష్మ వంటి బ్లాక్‌బస్టర్‌ వచ్చినా.. ఆ తర్వాత మళ్లీ హాట్రిక్‌ ఫ్లాపులు పడటం వల్ల ఆ హిట్ కాస్త కనిపించకుండా పోయింది. ప్రస్తుతం నితిన్‌ ఆశలన్నీ వక్కంతం వంశీ సినిమాపైనే ఉన్నాయి.

ఔను.. వాళ్లందర్నీ మళ్లీ 'కథలు' కలిపాయ్​.. త్వరలో సూపర్​హిట్​ మూవీలు పక్కా!

అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి.. ఈ కాంబోలు అసలు ఊహించనివి!

ABOUT THE AUTHOR

...view details