Nikhil Karthikeya 2: హీరో నిఖిల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకపోవడం వల్ల తన సినిమా రిలీజ్ డేట్‌ను మార్చేస్తున్నారని ఆరోపించారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగాంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తాజా వ్యాఖ్యలు చేశారు.
"ఆగస్టు 12న రావాలని నిర్ణయించుకున్న తర్వాత ఆ రోజు కూడా సినిమాను రిలీజ్ చేయవద్దంటూ కొందరు చెప్పారు. 'ఇప్పట్లో మీ సినిమా రిలీజ్ చేయద్దు...అక్టోబర్ లేదా నవంబర్ కు వెళ్లిపోండి' అని అన్నారు. 'కార్తికేయ 2'కి థియేటర్స్ దొరకవని అన్నారు. నా తొలి సినిమా హ్యాపీడేస్ నుంచి ఇలాంటి క్లిష్ట పరిస్థితి ఎప్పుడూ ఎదురుకాలేదు. సినిమా రిలీజ్ కాదనే ఆలోచన రాగానే భరించలేకపోయ" అని నిఖిల్ అన్నారు.