Antey sundaraniki promo song: చాలాకాలం తర్వాత నాని నటించిన కామెడీ ప్రధాన చిత్రం 'అంటే... సుందరానికీ!'. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ ఎంటర్‌టైనర్ జూన్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో స్పీడు పెంచిన మూవీటీమ్.. తాజాగా అంటే సుందరానికీ ప్రోమో సాంగ్‌ను రిలీజ్ చేసింది. ఈ పాటలోని హీరోహీరోయిన్ లుక్స్, లిరిక్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. కాగా, ఈ మూవీలో ఎంత వినోదం ఉంటుందో ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ చెప్పకనే చెప్పాయి. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో సుందర్‌గా నాని కనిపించనున్నారు. మలయాళ నటి నజ్రియా లీల అనే పాత్ర పోషించింది. నరేశ్, రోహిణి, హర్షవర్ధన్, రాహుల్ రామకృష్ణ, సుహాస్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం సమకూర్చారు.
Nikhil Spy movie glimpse: 'గూఢచారి', 'ఎవరు', 'హిట్' వంటి సినిమాలకు ఎడిటర్‌గా పనిచేసిన గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా స్పై. ఈ స్పై థ్రిల్లర్ చిత్రంలో యంగ్ హీరో నిఖిల్ ప్రధా పాత్రలో నటిస్తున్నారు. ఐశ్వర్యా మేనన్ కథానాయిక. తాజాగా ఈ మూవీ గ్లింప్స్ విడుదలైంది. ఇందులో నిఖిల్ మంచు కొండల్లో ఒంటరిగా నడుస్తూ కనిపించారు.