Nikhil Siddharth Swayambhu : 'కార్తికేయ-2'తో పాన్ ఇండియా సక్సెస్ అందుకున్న హీరో నిఖిల్.. ప్రస్తుతం 'ది ఇండియా హౌస్', స్వయంభు'..'కార్తికేయ-3' లాంటి సినిమాలు భారీ బడ్జెట్ సినిమాలే చేస్తున్నారు. ఇవి ఆసక్తితో పాటు అంచనాలను బాగానే పెంచాయి. అయితే ఈ మధ్య వచ్చిన ఆయన నుంచి వచ్చిన 'స్పై' భారీ డిజాస్టర్ అందుకుంది. దీంతో ఆయన మరింత జాగ్రత్తగా ముందుకెళ్లేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే నిఖిల్ తాజాగా తన హిస్టారికల్ డ్రామా 'స్వయంభు'ను(swayambu nikhil) సెట్స్‌పైకి తీసుకెళ్లి షూటింగ్ షురూ చేశారు. 14 శతాబ్దంలోని ఓ యోధుడి కథతో ముందుకు రాబోతున్నారు. అయితే ఈ చిత్రాన్ని రూపొందించడం అంత సులభం కాదనే చెప్పాలి. ఎన్నో ఛాలెంజెస్, రిస్క్‌తో కూడుకున్న పని అని చెప్పాలి.
ఎందుకంటే ఇలాంటి హిస్టారికల్ డ్రామా మావీస్ అంటే.. భారీ బడ్జెట్, ప్లాన్స్, ఎగ్జిక్యూషన్ చాలా అవసరం. ముఖ్యంగా ఆర్ధిక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. గతంలో వచ్చిన 'మగధీర', 'బాహుబలి' సిరీస్, 'పొన్నియిన్ సెల్వన్' సిరీస్‌ల విషయంలో ఇలాంటి సవాళ్లను చూశాం. ఇప్పుడు 'స్వయంభు'(nikhil swayambu budget) కోసం రూ.30కోట్లు పెడుతున్నారని తెలిసింది. అయితే ఈ సినిమా కథకు ఉన్న డిమాండ్ ఆధారంగా.. ఆ రేంజ్ బడ్జెట్లో పూర్తవ్వడం కష్టమని అంచనా వేస్తున్నారు నిపుణలు. బడ్జెట్ పెరిగే అవకాశముందని అంటున్నారు. నిర్మాతలు రాజీపడి చిత్రాన్ని తెరకెక్కిస్తే.. సినిమా క్వాలిటీ విషయంలో విమర్శలు ఎదురౌతాయని చెబుతున్నారు.
మరో సవాల్ ఏంటంటే.. అసలు ఇలాంటి హిస్టారికల్ డ్రామా నిఖిల్‌కు సెట్ అవుతుందా? యోధుడి పాత్రలో నిఖిల్‌ను చూడగలమా? యోధుడి పాత్ర అంటే ముఖంలో గంభీరం, బలమైన దేహధారుడ్యం ఉండాలి. అలాగే బలమైన నటనతో ప్రేక్షకుల్ని కట్టిపడేయగలగాలి. ఇప్పటికే బాహుబలిలో ప్రభాస్, మగధీరలో రామ్‌చరణ్ తమ నటనతో నిరూపించారు. యోధుడిగా వారి స్ర్రీన్ ప్రెజెన్స్ ఎంతో పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఆడియెన్స్ వారికి కనెక్ట్ అయ్యారు. మరి కూల్ అండ్ డీసెంట్ లుక్ ఉండే నిఖిల్.. ఇప్పటివరకు యోధుడి లాంటి పాత్రలను చేయలేదు. పవర్ఫుల్ యాక్టింగ్‌లో కూడా కనిపించలేదు. కాబట్టి ఇప్పుడీ పాత్ర ఆయనో పెద్ద సవాల్ లాంటిదనే చెప్పాలి. ఈ పాత్ర కోసం ఆయన తనలోని మరింత యాక్టింగ్ స్కిల్‌ను బయట పెట్టాలి. అలాగే తన బాడీ లాంగ్వేజ్‌ను మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ యోధుడి పాత్ర కోసం నిఖిల్ ఎలా సన్నద్ధమవుతున్నారు? అనేది చూడాలి.