Spy second day collections : టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'స్పై' చిత్రానికి భారీ ఓపెనింగ్స్ దక్కిన విషయం తెలిసిందే. టాక్, రివ్యూస్ ఎలా ఉన్నా సరే.. బక్రీద్ సెలవు ఈ చిత్రానికి బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. తొలి రోజే ఈ చిత్రం రూ.11 కోట్లకు పైగా గ్రాస్ వచ్చినట్టు మూవీటీమ్ అధికారికంగా ప్రకటించింది. అంటే షేర్ రూ.ఏడు కోట్ల వరకు వచ్చి ఉంటుంది. రూ.18కోట్ల వరకు బిజినెస్ చేసుకున్న ఈ సినిమాకు.. రికవరీ మొదటి రోజే బాగా జరిగిపోయింది. కానీ ఈ జోరు మొదటి వీకెండ్ మొత్తం కొనసాగిస్తేనే.. సినిమా మంచి వసూళ్లను అందుకుంటుంది. లేదంటే అంతే సంగతి మరి.
Nikhil spy movie : అయితే టాక్ ఎఫెక్ట్ వల్ల.. రెండో రోజు నుంచే లెక్కలో కాస్త తగ్గుదల కనిపిస్తోంది! బిసి సెంటర్స్‌లో డ్రాప్ కాస్త చెప్పుకోదగ్గ స్థాయిలోనే కనిపిస్తోందట. రెండో రోజు ఆశించిన రీతిలో చిత్రానికి స్పందన రాలేదని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు భారీగానే పడిపోయాయట. రెండో రోజు ఈ చిత్రానికి రూ.1.50 -1.70 కోట్లు షేర్‌ను మాత్రమే వచ్చిందట. వరల్డ్ వైడ్‌గా రూ. 2.10 - 2.30 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం అందింది. కాబట్టి.. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ అందుకుంటుందో లేదో తెలియాలంటే ఈ ఆదివారం గడవాల్సిందే.
స్టామినా పెరిగింది... అయితే ఈ కలెక్షన్ల సంగతి కాస్త పక్కనపెడితే.. నిఖిల్ మార్కెట్ స్టామినా పెరిగిందనడానికి 'స్పై' చిత్రమే నిదర్శనం. ఎందుకంటే టాక్‌తో సంబంధం లేకుండా.. 'కార్తికేయ 2' హిట్ ఫ్రభావం, కేవలం ప్రచార చిత్రాలతో వచ్చిన బజ్వల్ల నిఖిల్ సినిమాను తొలి రోజే చూసేందుకు ఆడియెన్స్ రెడీ అయ్యారని అర్థమైంది. 'స్పై' మూవీ రోజే రిలీజైన మరో టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు నటించిన 'సామజవరగమన' చిత్రం.. మొదటి రోజు పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాకే సినిమాను చూస్తున్నారు ఆడియెన్స్. దాని పికప్ స్లోగా మొదలైంది. ఇప్పుడు మల్టీ ఫ్లెక్సులు షోలు మెల్లగా ఫుల్ అవుతున్నాయి. అదే ఒకవేళ 'స్పై' యునానిమస్‌గా బాగుందని పబ్లిక్ టాక్ తెచ్చుకుని ఉంటే మాత్రం.. ఈ లెక్క వేరేలా ఉండేది. కాబట్టి ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే 'స్పై'కు అంత అనుకూలంగా లేవని తెలుస్తోంది.