తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

పాన్​ ఇండియా హీరోగా నిఖిల్​.. రామ్​ కోసం శింబు.. ఓటీటీలో 'గని' - సింగర్​గా శింబు ది వారియర్​

New Cinema updates: కొత్త సినిమా అప్డేట్స్​ వచ్చాయి. ఇందులో వరుణ్​తేజ్, నిఖిల్​ పాన్​ఇండియా మూవీ, రామ్​పోతినేని, శింబు చిత్రాల సంగతులు ఉన్నాయి.

Nikhil Pan india movie
నిఖిల్​ పాన్ ఇండిాయ సినిమా

By

Published : Apr 17, 2022, 1:02 PM IST

Nikhil Pan india movie: విభిన్న చిత్రాలు చేస్తూ కెరీర్​లో ముందుకెళ్తున్న నటుడు నిఖిల్​.. తన కొత్త సినిమాను ప్రకటించారు. ప్రముఖ దర్శకుడు గర్రీ బీహెచ్​తో తన 19వ సినిమాను పాన్​ ఇండియా స్థాయిలో చేయనున్నట్లు తెలిపారు. దీనికి 'స్పై' అనే పేరును టైటిల్​గా ఖరారు చేశారు. ​ఫస్ట్​ లుక్ పోస్టర్​​ను విడుదల చేశారు. ఇందులో నిఖిల్​ స్టైలిష్​ లుక్​లో గన్​ పట్టుకుని నడుస్తూ కనిపించారు. ఇది అభిమానులను ఆకట్టుకునేలా ఉంది. ఇక ఈ సినిమాను ఈడీ ఎంటర్​టైన్మెంట్స్​ బ్యానర్​పై కే రాజా శేఖర్ రెడ్డి నిర్మిస్తుండగా.. ఐశ్వర్య మేనన్​ హీరోయిన్​గా నటిస్తోంది. అభినవ్​, సన్య ఠాకూర్​, జిస్సు సేన్​గుప్తా, నితిన్​ మెహ్తా, రవి వర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. హాలీవుడ్​ టెక్నిషియన్​ జూలియన్​ అమరు ఎస్త్రాదా సినిమాటోగ్రాఫర్​. శ్రీచరణ్​ పాకాల సంగీతం అందిస్తున్నారు.

నిఖిల్ పాన్​ ఇండియా సినిమా

Simbu Rampotineni The warrior movie: కోలీవుడ్​ హీరో శింబు.. ఓ వైపు హీరోగా నటిస్తూనే.. మరోవైపు అప్పుడప్పుడు సింగర్​గా గొంతును సవరించుకోవడం చేస్తుంటారు. ఇప్పటికే మంచు మనోజ్​ పోటుగాడు, సాయితేజ్​ తిక్క చిత్రంలోనూ పాటలు పాడిన ఆయన.. తాజాగా హీరో రామ్​పోతినేని ది వారియర్​ కోసం సింగర్​ అవతారం ఎత్తనున్నారు. ఈ విషయాన్ని మూవీటీమ్​ తెలిపింది. అయితే ఈ గీతం రొమాంటిక్ సాంగ్​ అని తెలుస్తోంది. కాగా, ఈ చిత్రానికి లింగుసామి దర్శకత్వం వహిస్తుండగా దేవీశ్రీ ప్రసాద్​ సంగీతం అందిస్తున్నారు.

ది వారియర్​

Varun tej Gani OTT release: బాక్సింగ్ కథాంశంతో వరుణ్ తేజ్, సయీ మంజ్రేకర్ జంటగా తెరకెక్కిన చిత్రం 'గని'. కిరణ్‌ కొర్రపాటి దర్శకుడు, అల్లు అరవింద్‌ సమర్పకులు. జగపతిబాబు, సునీల్‌ శెట్టి, ఉపేంద్ర, నవీన్‌చంద్ర ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి తమన్‌ సంగీతమందించారు. ఇటీవలే థియేటర్లలో విడుదలైన ఈ మూవీ మిశ్రమ స్పందనలను అందుకుంది. అయితే ఇప్పుడీ చిత్రం ఓటీటీ వేదికగా సందడి చేసేందుకు సిద్ధమైంది. ఏప్రిల్​ 22 నుంచి తన ప్లాట్​ఫామ్​ వేదికగా స్ట్రీమింగ్​ కానున్నట్లు ఆహా తెలిపింది. ఓ వీడియోను కూడా పోస్ట్​ చేసింది.

ఇదీ చూడండి: ట్విటర్‌ ఖాతా పేరు మార్చుకున్న చిరు.. కారణమిదే?

ABOUT THE AUTHOR

...view details