Nikhil Karthikeya 2 release date: నిఖిల్ హీరోగా తెరకెక్కిన మిస్టరీ థ్రిల్లర్ చిత్రం 'కార్తికేయ 2'. వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్ర కొత్త విడుదల తేదీ ఖరారైపోయింది. నిజానికి ఈ నెల 22న రిలీజ్ కావాల్సిన ఈ మూవీ... ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లో ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్ కథానాయిక. శ్రీకృష్ణుడి తత్వం, ద్వారకా నగరం నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. తొలి భాగం 'కార్తికేయ' సూపర్‌హిట్ కావడంతో ఈ సీక్వెల్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు విశేష స్పందన లభించింది. ఇస్కాన్ అత్యున్నత సంస్థానం ఉత్తర్‌ప్రదేశ్‌లోని 'బృందావన్' సందర్శించాలంటూ ఆహ్వానం అందగా చిత్ర బృందం మంగళవారం సందర్శించింది. భారతీయ సినీ చరిత్రలోనే ఇది ఎవరికీ దక్కని అరుదైన గౌరవం అని సినీవర్గాలు పేర్కొన్నాయి.
నితిన్ వర్సెస్ నిఖిల్.. బాక్సాఫీస్ హిట్ కొట్టేదెవరు? - నితిన్ వర్సెస్ నిఖిల్
Nikhil Karthikeya 2 release date: నిఖిల్ హీరోగా తెరకెక్కిన 'కార్తికేయ 2' కొత్త రిలీజ్ డేట్ ఖరారైపోయింది. ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లో ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
నితిన్ వర్సెస్ నిఖిల్
కాగా, కార్తికేయ 2 రిలీజ్ రోజునే హీరో నితిన్ నటించిన 'మాచర్ల నియోజకవర్గం' రిలీజ్ కానుంది. ఇందులో హీరోయిన్గా కృతిశెట్టి, కేథరిన్ నటించారు. మరి ఈ రెండు చిత్రాల్లో ఏదో విజయం సాధిస్తుందో చూడాలి.
ఇదీ చూడండి: మరోసారి తల్లికాబోతున్న ఐశ్వర్య.. ఇదిగో ప్రూఫ్!