తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

అక్కడ చిరంజీవిపై కోడిగుడ్లు విసిరేసిన జనం.. అసలేమైంది? - నిజం విత్ స్మిత చిరంజీవి ప్రోమో

ఓ సారి పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడ మెగాస్టార్​ చిరంజీవిపై కోడిగుడ్లు విసిరారు. అసలేం జరిగిందంటే?

chiranjeevi
అక్కడ చిరంజీవిపై కోడిగుడ్లు.. అసలేమైంది?

By

Published : Feb 8, 2023, 5:03 PM IST

తెలుగు ఓటీటి సెలబ్రెటీలు స్పెషల్ టాక్ షోలు ఈ మధ్యకాలంలో ఆడియెన్స్​ను బాగా ఆకట్టుకుంటున్నాయి. బ్లాక్ బాస్టర్ హిట్​ దిశగా కొనసాగుతున్నాయి. దీంతో పలు ఎంట్​ర్​టైన్మెంట్​ సంస్థలు ప్రేక్షకులను అట్రాక్ట్​ చేసేందుకు ఇలాంటి షోలను రూపొందిస్తున్నాయి. అలా తాజాగా మరో ఓటీటీ సెలబ్రిటీ టాక్ షో మొదలైంది. అదే నిజం విత్​ స్మిత. తాజాగా ఈ షో ఫస్ట్​ ఎపిసోడ్​కు మెగాస్టార్ చిరంజీవి హాజరై సందడి చేశారు. నటుడిగా తాను ప్రశంసలే కాదు.. విమర్శలను సైతం ఎదుర్కొన్నట్లు చెప్పారు.

గతంలో తాను జగిత్యాలకు వెళ్లగా.. అక్కడ అభిమానులు తనపై పూలవర్షం కురిపించారని.. అదే సమయంలో కొంతమంది కోడిగుడ్లు కూడా విసిరారని ఆయన తెలిపారు. "స్టార్‌డమ్‌ను సొంతం చేసుకునే క్రమంలో మీకు ఎదురైన అవమానాలు, అనుమానాలు ఏమిటి?" అని ప్రశ్నించగా ఆయన ఈ విధంగా వివరించారు. అంతేకాకుండా తన కెరీర్‌ ఎలా మొదలైంది? తన ఫస్ట్‌ క్రష్ ఎవరు‌? ప్రస్తుతం సినీ పరిశ్రమ ఎలా ఉంది? ఇలాంటి ఎన్నో ఆసక్తికర విషయాల గురించి చిరు ఈ షోలో మాట్లాడారు. చిరంజీవి అతిథిగా నిజం తొలి ఎపిసోడ్‌ ఫిబ్రవరి 10 నుంచి సోనీలివ్‌లో ప్రసారం కానుంది.

ఇదీ చూడండి: మెగా ఫ్యాన్స్​కు షాక్​.. 'వాల్తేరు వీరయ్య' సక్సెస్​​ అస్సలు యూజ్​ అవ్వలేదా?

ABOUT THE AUTHOR

...view details