Niharika Movie What The Fish : మెగా డాటర్ నిహారిక కొణిదెల మరోసారి వెండితెరపై మెరవనుంది. టాలీవుడ్ స్టార్ హీరో మంచు మనోజ్ నటిస్తున్న 'వాట్ ది ఫిష్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను కొత్త దర్శకుడు వరుణ్ కోరుకండ తెరకెక్కిస్తున్నారు. విశాల్ అండ్ సూర్య బెజవాడ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఈ సినిమాకు శక్తికాంత్ కార్తీక్ సంగీతం అందిస్తున్నారు. ఇక నిహారిక పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేసింది మూవీ టీమ్.
కొన్ని నెలల క్రితమే ఈ సినిమా టైటిల్ (వాట్ ది ఫిష్) ను ప్రకటించింది మూవీయూనిట్. ఈ సినిమాలో మంచు మనోజ్ హీరో అని తెలుపుతూ వీడియో గ్లింప్స్ విడుదల చేశారు. తర్వాత హాస్య నటుడు వెన్నెల కిషోర్ కీలక పాత్ర పోషిస్తున్నాట్లు తెలిపింది చిత్రబృందం. ఇప్పుడు నిహారిక బర్త్ డే సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ పోస్టర్ను రిలీజ్ చేసింది మూవీ టీమ్. ఈ పోస్టర్లో నిహారిక వైట్ షార్ట్ డ్రెస్లో మెరిసిపోతూ కనిపిస్తోంది. అలానే నిహారిక వెనకాల డాలర్ గుర్తును పెట్టారు. దీంతో ఈ మూవీలో నిహారిక అష్టలక్ష్మీ క్యారెక్టర్లో కనిపించన్నట్లు అర్థం అవుతోంది. అయితే నిహారిక ఈ సినిమాలో హీరోయిన్గా లేదా ఏదైనా కీలక పాత్రలో నటిస్తుందా అనేది క్లారిటీ రావాల్సి ఉంది.