తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

మెగా డాటర్​ నిహారిక టాటూ చూశారా? దాని అర్థం ఏంటో తెలుసా? - నిహారిక కొణెదల లేటెస్ట్​ అప్టేట్లు

మెగా బ్రదర్​ నాగబాబు ముద్దుల కుమార్తె నిహారిక ప్రస్తుతం టర్కీలో వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. తాజాగా బికినీలో కనిపించిన ఈ అమ్మడు ఒంటిపై ఉన్న టాటూ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇంతకీ దాని అర్థం ఏంటని నెటిజన్లు ఆలోచిస్తున్నారు.

niharika-konidela-tattoo-meaning
niharika-konidela-tattoo-meaning

By

Published : Nov 10, 2022, 10:40 PM IST

Niharika Konidela Tattoo: మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఇంట్లో అయినా, బయట అయినా ఓరేంజ్​లో సందడి చేస్తుంది. మెగా బ్రదర్స్ దగ్గర చాలా గారాబంగా కనిపిస్తుంటుంది. సినిమా బ్యాక్​ గ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి రావడంతో మోడ్రన్​గా పెరిగింది. ఈ ముద్దుగుమ్మకు సరదాగా షికార్లు చేయడం అంటే ఎక్కడలేని ఇష్టం.

ఖాళీ సమయం దొరికితే చాలు ఫ్రెండ్స్, పార్టీలు అంటూ ఎంజాయ్ చేస్తుంది. తాజాగా ఈమె తుర్కియే(టర్కీ) విమానం ఎక్కింది. తన మిత్రులతో కలిసి వెకేషన్​ను హ్యాపీగా, జాలీగా గడుపుతోంది. బీచుల్లో, స్విమ్మింగ్ పూల్స్​లో బికినీలు వేసుకుని స్విమ్మింగ్ చేస్తోంది. విహారయాత్రకు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తోంది.

నిహారిక

నిహారిక బికినీ వేసుకుని సరదాగా గడుపుతున్న సమయంలో తీసిన ఫొటోలు కొన్ని నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. అప్పుడప్పుడు బికినీ ధరించే నిహారిక ఫొటోలను చూసి ఆశ్చర్యపోతున్నారు. ఈ ఫొటోల్లో నెటిజన్లను ఆకట్టుకున్న మరో విషయం ఉంది. అదే నిహారిక వీపు మీద ఉన్న టాటూ. ఈ టాటూను కాస్త తీక్షణంగా పరిశీలిస్తే 'NK' అనే లెటర్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంతకీ ఈ లెటర్స్ అర్థం ఏంటని నెటిజన్లు తెగ ఆలోచించేస్తున్నారు.

నిహారిక టాటూ

చివరకు 'NK' అంటే నిహారిక కొణిదెల కావొచ్చని ఓ అంచనాకు వచ్చారు. ఆ అక్షరాలకు పక్కనే ఓ బర్డ్ ఎగురుతున్నట్లు కనిపిస్తుంది. దాని పక్కన ఓ వింత డిజైన్ కనిపిస్తుంది. దాని పూర్తి అర్థం ఎవరికీ తెలియకపోయినా.. 'NK' అంటే నిహారిక కొణిదెల అని ఫిక్స్​ అవుతున్నారు. వాస్తవానికి నిహారిక వీపు మీద ఉన్న టాటూ 'సైరా' సినిమా షూటింగ్ సమయంలోనే కనిపించింది.

ABOUT THE AUTHOR

...view details