తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

పవన్ సాంగ్​కు నిహారిక, లావణ్య త్రిపాఠి - డ్యాన్స్ అదిరింది! - mega family sankranthi

Niharika Lavanya Tripathi Dance : మెగా సంక్రాంతి సంబరాల్లో భాగంగా పవన్ కళ్యాణ్ సాంగ్​(సర్దార్​ గబ్బర్​సింగ్​)కు నిహారిక - లావణ్య త్రిపాఠి అదిరిపోయేలా డ్యాన్స్​ చేశారు. ఆ వీడియోను మీరు చూశారా?

బాబాయ్​ పవన్​ సాంగ్​కు వదినా ఆడపడుచు డ్యాన్స్ - అదిరింది!
బాబాయ్​ పవన్​ సాంగ్​కు వదినా ఆడపడుచు డ్యాన్స్ - అదిరింది!

By ETV Bharat Telugu Team

Published : Jan 18, 2024, 8:16 PM IST

Updated : Jan 19, 2024, 12:36 PM IST

Niharika Lavanya Tripathi Dance : మెగా సంక్రాంతి సంబరాలు బెంగుళూరులోని ఫామ్ హౌస్​లో గ్రాండ్​గా జరిగిన విషయం తెలిసిందే. మూడు రోజుల పాటు మెగా - అల్లు ఫ్యామిలీస్ ముగ్గుల పండగను ఫుల్​ హ్యాపీగా చేసుకున్నాయి. పవన్ కళ్యాణ్ తప్ప అందరూ ఈ వేడుకకు హాజరై సందడి చేశారు. ఇక పండగ పూర్తి కావడం వల్ల నిన్ననే హైదరాబాద్​కు చేరుకున్నారు. వేడుకకు సంబంధించిన ఫొటోలను చిరంజీవి, ఉపాసన ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉన్నారు. అయితే తాజాగా మెగాడాటర్​ నిహరిక కొన్ని ఫొటోలను, వీడియోలను పోస్ట్​ చేసింది. ఇందులో ఒకటి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

అదేంటంటే వదినా ఆడపడుచు(లావణ్య త్రిపాఠి - నిహారిక) ఇద్దరు కలిసి డ్యాన్స్​తో అదరగొట్టడం. బాబాయ్ పవన్ కళ్యాణ్ సాంగ్​(సర్దార్​ గబ్బర్​సింగ్​)కు నిహారిక, లావణ్య డ్యాన్స్​ చేసి ఆకట్టుకున్నారు. ఈ వీడియో చూసిన అభిమానులు వదినా ఆడపడుచు డ్యాన్స్​ సూపరహే అని అంటూ కామెంట్లు చేస్తూ షేర్ చేస్తున్నారు.

కాగా, గతేడాది నిహారిక అన్న, హీరో వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి పెళ్లి ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. లావణ్య త్రిపాఠిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వరుణ్. అయితే పెళ్ళికి ముందు నుంచే నిహారిక, లావణ్య మంచి ఫ్రెండ్స్ కూడా. అందుకే పెళ్లి తర్వాత కూడా వారు మంచి ఫ్రెండ్స్​లానే ఉంటున్నారు. అందుకే ఈ సంక్రాంతి సంబరాల్లో హడావిడి అంతా ఈ వదినా ఆడపడుచులదే అన్నట్టుగా కలిసి సరదాగా గడిపారు.

ఇకపోతే మెగా ఫ్యామిలీలో నిహారిక అంటే ఎంతో స్పెషల్ అన్న సంగతి తెలిసిందే. విడాకులు తీసుకున్న తర్వాత ఈ భామ ప్రస్తుతం ఓవైపు నటిగా, మరోవైపు నిర్మాతగా ఎదగడానికి ప్రయత్నాలు చేస్తోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్​గా ఉంటూ తనకు సంబంధించిన పర్సనల్​ లైఫ్​ విషయాలను షేర్​ చేసుకుంటోంది. లావణ్య త్రిపాఠి సినిమాల విషయానికొస్తే పెళ్లి తర్వాత ఆమె నటించిన తొలి ప్రాజెక్ట్‌ 'మిస్‌ పర్‌ఫెక్ట్‌' వెబ్‌ సిరీస్‌. డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా ప్రసారం కానున్నలో ఈ సిరీస్​లో ఆమె ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.

మెగా ఫ్యామిలీ ఫుల్‌ ఫొటో - స్పెషల్ అట్రాక్షన్​గా అకీరా, ఆద్యా

మెగా వేడుకల్లో అర్హ సందడి - దొరికిన బుజ్జి ఫ్రెండ్!

Last Updated : Jan 19, 2024, 12:36 PM IST

ABOUT THE AUTHOR

...view details