తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

న్యూ లైఫ్​ స్టార్ట్​ చేసిన నిహారిక కొణిదెల! - నిహారిక డెడ్​ పిక్సల్స్​ వెబ్​సిరీస్​ రిలీజ్​

కొద్ది రోజులుగా ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తున్న నిహారిక కొణిదెల.. లైఫ్​ను రీస్టార్ట్​ చేసింది. ఆ వివరాలు..

Niharika
న్యూ లైఫ్​ స్టార్ట్​ చేసిన నిహారిక కొనిదెల

By

Published : May 1, 2023, 9:40 PM IST

Updated : May 1, 2023, 10:30 PM IST

మెగా డాటర్​గా ఇండస్ట్రీకి పరిచయమైన నిహారిక కొణిదెల.. హీరోయిన్​గా పెద్దగా సక్సెస్​ కాలేకపోయింది. అడపాదడపా సినిమాలు చేసిన ఈమె.. ఆ తరువాత చైతన్య జొన్నలగడ్డను అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని లైఫ్​లో సెటిల్​ అయింది. ఇక వివాహం తర్వాత యాక్టింగ్​కు బ్రేక్​ ఇచ్చిన నిహారిక.. జీవితాన్ని సరదాగా గడుపుతూ ముందుకెళ్లింది. ఈ క్రమంలోనే నిర్మాతగా మారి చిత్రాలను నిర్మిస్తోంది. అయితే గత కొన్నిరోజులుగా ఆమెపై ఎన్నో రుమార్స్​ వస్తున్నాయి. భర్తతో విబేధాలు, విడాకులు తీసుకోబోతుందని అంటూ వార్తల్లో ఎక్కడ చూసిన ఈమె గురించే కనిపిస్తోంది. మరి ఇందులో నిజం ఎంత వరకు ఉందో తెలియదు.

ఏదేమైనప్పటికీ వీటన్నింటినీ నుంచి బయటపడడానికి నిహారిక మళ్లీ కొత్త అవతారంలో యాక్టింగ్​లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సారి సిల్వర్​స్క్రీన్​పైకి కాకుండా డిజిటల్ ప్లాట్​ఫామ్​ ఓటిటీలోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ ఓటిటీ ఆమెకు కొత్తేమికాదు. ఇప్పటికే ముద్దపప్పు ఆవకాయ, నాన్న కూచి లాంటి వెబ్ సిరీస్​ల్లో నటించింది. తాజాగా 'డెడ్ పిక్సల్స్​'తో ఆడియెన్స్ ముందుకు రానుంది.

వైవా హర్ష, అక్షయ్‌ లింగుస్వామి, సాయి రోణక్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సిరీస్​కు ఆదిత్య మండల దర్శకత్వం వహిస్తున్నారు. బీబీసీ స్టూడియోస్ ఇండియా అండ్ తమడ మీడియా సంయుక్తంగా ఈ సిరీస్​ను నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ 'డిస్నీ+ హాట్‌స్టార్‌'లో ఈ నెల 19నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా టీజర్‌ను రిలీజ్ చేశారు దర్శక, నిర్మాతలు. ఇందులో ముఖ్యంగా యువత.. వీడియో గేమ్‌లకు ఎంతగా ప్రభావితమవుతుందో ఈ సిరీస్‌లో చూపించబోతున్నట్టు ప్రచార చిత్రం చూస్తుంటే అర్థమవుతోంది. ఆనంద్, గాయత్రీ, భార్గవ్, రోషన్ అనే నలుగురు స్నేహితులు కలిసి ఓ ఆన్​లైన్​లో గేమ్​లో పాల్గొని అడుతుంటారు. అయితే ఆ గేమ్ నుంచి వారు బయటికి రాలేరు. ఈ క్రమంలోనే చుట్టూ ఉన్న ప్రపంచాన్ని వదిలి అదే జీవితం అన్నట్లు గడిపేస్తుండటం.. ఈ ప్రచార చిత్రంలో చూపించారు. ఇంతకీ అసలా గేమ్ ఏంటి? ఎందుకు వారు ఆ గేమ్​కు అంతలా ఎడిక్ట్ అయ్యారు? ఆ ఆట వల్ల వారి జీవితాల్లో ఎలాంటి పర్యవసానాలు ఎదురయ్యాయి? అనేది ఈ సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే. మరి ఈ రీఎంట్రీతో మెగా డాటర్ కెరీర్​లో ఎలా రాణిస్తుందో చూడాలి..

ఇదీ చూడండి:మోక్షజ్ఞ సిల్వర్​ స్క్రీన్​ ఎంట్రీ ప్లాన్ సూపర్​​.. ఆ మాస్​ దర్శకుడితోనే!

Last Updated : May 1, 2023, 10:30 PM IST

ABOUT THE AUTHOR

...view details