New National Crush Tripti Dimri :తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన 'యానిమల్' సినిమా బాక్సాఫీసు ముందు దూసుకెళ్తోంది. ఈ మూవీలో రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్న లీడ్ రోల్స్‌లో అదరగొట్టారు. ఈ క్రమంలో చిత్రంలో కామియో రోల్ చేసిన ఓ అందాల నటి ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. స్క్రీన్ టైమ్ తక్కువ ఉన్నప్పటికీ తన అందం, అభినయంతో నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది. ఎవరీ ముద్దుగుమ్మ అంటూ కుర్రకారు సోషల్ మిడియాలో తెగ వెతికేస్తున్నారు.
దేశవ్యాప్తంగా కుర్రాళ్లు మనసు పారేసుకున్న ఆ బ్యూటీ పేరు తృప్తి డిమ్రి. యానిమల్‌తో ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ గురించి మరో వార్త వైరల్ అవుతోంది. రష్మికను వెనక్కు నెట్టి ఈ అమ్మడు కొత్త నేషనల్‌క్రష్ అయిందట. ఈ మేరకు సోషల్ మీడియాలో ఈ అమ్మడు అభిమానులు సరదాగా పోస్టులు పెడుతున్నారు.
ఒక్కసారిగా పెరిగిన ఫాలోవర్లు!
Tripti Dimri Instagram Followers :ఒక్క సినిమాలో ఇద్దరి ముద్దుగుమ్మల లైఫ్‌లు ఛేంజ్ అయ్యాయని సరదాగా పోస్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. దీంతో పాటు తృప్తి డిమ్రికి వరుస ఆఫర్లు కూడా వస్తున్నట్లు సమాచారం. ఇక యానిమల్ తర్వాత తృప్తి డిమ్రి ఇన్‌స్టా ఫాలోవర్స్ భారీగా పెరిగారు. ఈ చిత్రం తర్వాత తృప్తి ఇన్‌స్టా ఫాలోవర్స్ చూసి నెటిజన్లు ఆశ్యర్చపోతున్నారు. నవంబర్ చివరి వారంలో ఆమెకు 6లక్షల మంది ఫాలోవర్స్ ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 30 లక్షలకు చేరింది. ఇక 2015లో తృప్తి ఇన్‌స్టాలోకి అడుగుపెట్టారు. అప్పటి నుంచి సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉంటూ తన సినిమా విశేషాలతో పాటు రీల్స్‌తోనూ ఆమె సందడి చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె పోస్ట్‌లు అన్నింటికి లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి.