New Movies to be Released: సినిమా థియేటర్లలో సందడి మొదలైంది. వరుసపెట్టి సినిమాలు విడుదల అవుతుండటం వల్ల అభిమానులు పండగ చేసుకుంటున్నారు. 'అఖండ'తో మొదలైన బాక్సాఫీస్ సందడి.. 'ఆర్ఆర్ఆర్'తో నెక్స్ట్ లెవల్‌కి చేరింది. మరో నాలుగు నెలల పాటు తీరికలేకుండా వినోదాన్ని అందించేందుకు సినిమాలు సిద్ధమవుతున్నాయి.
పోటీలో ఆ రెండు:ఈ నెల 8వ తేదీన 'గని' సినిమా విడుదల కాబోతోంది. వరుణ్ తేజ్ బాక్సర్‌గా కనిపించబోతున్నారు. ఏప్రిల్‌లో ఎన్ని సినిమాలు వస్తున్నా.. అందరి ఫొకస్ మేజర్‌గా రెండు పెద్ద సినిమాలపై పడుతోంది. స్టార్ హీరో విజయ్ నటించిన 'బీస్ట్' ఏప్రిల్ 13న విడుదల అవుతుండగా.. కన్నడ స్టార్ యష్ నటించిన 'కేజిఎఫ్ చాప్టర్ 2 ' మరుసటి రోజు 14న విడుదల కానుంది. ఈ రెండింటి మధ్య జరిగే బాక్సాఫీస్ పోటీ ఆసక్తికరంగా మారనుంది.
పోటీలో మూడు:ఏప్రిల్ 22న మరో మూడు చిన్న తెలుగు సినిమాలు పోటీ పడబోతున్నాయి. విశ్వక్ సేన్ నటించిన 'అశోక వనంలో అర్జున్ కల్యాణం', నాగ శౌర్య.. 'కృష్ణ వ్రింద విహారి' సినిమాలు రాబోతున్నాయి. ఇక తెలుగులో టాప్ మోస్ట్ సీనియర్ యాంకర్ సుమ మెయిన్ లీడ్‌లో నటించిన 'జయమ్మ పంచాయతీ' కూడా అదే రోజు విడుదల కానుంది.
ఆచార్య:మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలయికలో తెరకెక్కిన 'ఆచార్య' సినిమా కోసం కూడా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకుడు. ఏప్రిల్ 29న గ్రాండ్‌గా విడుదల కానుంది 'ఆచార్య'.
మే 12న మహేష్ బాబు:సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్న 'సర్కారు వారి పాట' మే 12న రిలీజ్ కానుంది. కీర్తి సురేష్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాను 'గీతగోవిందం' దర్శకుడు పరశురాం తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమా వచ్చిన రెండు వారాల అనంతరం కామెడీ మల్టీస్టారర్ మూవీ 'ఎఫ్3' విడుదల కానుంది. అదేరోజు అడివి శేష్ 'మేజర్' సినిమా కూడా రాబోతోంది. ఇక జూన్ 3న కమల్ హాసన్ 'విక్రమ్' తెలుగులో కూడా భారీ స్థాయిలో విడుదలకానుంది.
జూన్ 10న నేచురల్ స్టార్ నాని నటించిన 'అంటే సుందరానికీ!' సినిమా విడుదల కానుండగా.. జూన్ 17న రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ' చిత్రం ప్రేక్షకులముందుకు రానుంది. ఇక జూలై 1న ఒకేసారి రెండు తెలుగు సినిమాలు రాబోతున్నాయి. గోపీచంద్ 'పక్కా కమర్షియల్'.. అలాగే వైష్ణవ్ తేజ్ మూడవ సినిమా 'రంగ రంగ వైభవంగా' అదే రోజు విడుదలకానున్నాయి.
ఇదీ చూడండి:'ఆ పార్టీకి వెళ్లడమే పొరపాటు.. నాన్న కోపాన్ని, బాధను చూడాల్సి వచ్చింది!'