స్టార్ హీరోయిన్ ముద్దుగుమ్మ తమన్నా పెళ్లి కబురు కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఆ మధ్యలో ఆమె ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోబోతున్నట్లు జోరుగా ప్రచారం సాగింది. అయితే ఇప్పుడు మళ్లీ హాట్‌టాపిక్‌గా మారింది. అయితే ఈ సారి పెళ్లి కాదు కానీ డేటింగ్లో ఉన్నట్లు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. 'ఎమ్‌సీఎ' నటుడు విజయ్ వర్మతో ఈ ముద్దుగుమ్మ ప్రేమలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ మిల్కీ బ్యూటీ.. న్యూ ఇయర్ వేడుకల్ని అతడితో కలిసి గోవాలో స్పెషల్‌గా సెలబ్రేట్ చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వీడియోల్లో తమన్నా, విజయ్ వర్మ సన్నిహితంగా కనిపించారు. మరికొన్ని వీడియోల్లో ముద్దులు కూడా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. దీంతో వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారంటూ ప్రచారం ఊపందుకుంది.
కాగా, ప్రస్తుతం తమన్నా, విజయ్ వర్మ కలిసి లస్ట్ స్టోరీస్ -2లో జంటగా నటిస్తున్నారు. 2018లో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన లస్ట్ స్టోరీస్‌కు కొనసాగింపుగా ఇది తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారినట్లు టాక్. ఇకపోతే గత కొద్ది రోజులుగా తమన్నా, విజయ్ వర్మ కలిసి తిరుగుతున్న ఫొటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.