తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

నిర్మాత నాగవంశీ కీలక నిర్ణయం.. స్కూల్​ పిల్లలందరికీ 'సార్'​ సినిమా ఫ్రీ షో.. - నాగవంశీవార్లు

నిర్మాత నాగవంశీ కీలక నిర్ణయం తీసుకున్నారు. పాఠశాలల్లో చదువుతున్న చిన్నారుల కోసం 'సార్'​ చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శించాలనుకుంటున్నామని ఆయన ట్వీట్​ చేశారు. షో వివరాలను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.

netizens-applauds-producer-naga-vamsi-decision-regarding-sir-movie
netizens-applauds-producer-naga-vamsi-decision-regarding-sir-movie

By

Published : Mar 4, 2023, 7:30 PM IST

కోలీవుడ్‌ స్టార్‌ హీరో ధనుష్‌ కథానాయకుడిగా చదువు గొప్పతనాన్ని తెలియజేసేలా తెరకెక్కిన చిత్రం 'సార్‌'. వెంకీ అట్లూరి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఇది రూపుదిద్దుకుంది. ప్రస్తుతం థియేటర్లలో రన్‌ అవుతోన్న ఈ సినిమా విషయంలో నిర్మాత నాగవంశీ ఓ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. పాఠశాలల్లో చదువుతున్న చిన్నారుల కోసం దీన్ని ఉచితంగా ప్రదర్శించాలనుకుంటున్నామని తెలిపారు.

"విద్య వల్ల వచ్చే గౌరవాన్ని, దాని విలువపై అందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో 'సార్‌' చిత్రాన్ని తెరకెక్కించాం. ఈ నేపథ్యంలోనే స్కూల్స్‌లో చదువుతున్న పిల్లలకు మా ఈ చిత్రాన్ని ఉచితంగా చూపించనున్నందుకు ఆనందిస్తున్నాను. మీ స్కూల్‌కు సంబంధించిన వివరాలను మా సంస్థకు మెయిల్‌ చేయగలరు. షో వివరాలను మా టీమ్‌ మీకు త్వరలో తెలియజేస్తుంది" అని వంశీ తెలిపారు.

ఈ ట్వీట్‌ చూసిన నెటిజన్లు నిర్మాత నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తాజాగా ఈ చిత్రాన్ని నందమూరి బాలకృష్ణ వీక్షించారు. సినిమా బాగుందంటూ చిత్రబృందాన్ని మెచ్చుకున్నారు. 'సార్‌' బాక్సాఫీస్‌ వద్ద బాగానే సందడి చేస్తోంది. తాజాగా తెలుగు, తమిళ భాషల్లో కలిపి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.100కోట్ల (గ్రాస్‌) మార్కును దాటింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం పోస్టర్‌ను విడుదల చేసింది. అంతేకాదు, సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపింది.

.

ABOUT THE AUTHOR

...view details