తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

సామ్​కు ధైర్యం చెబుతున్న నెటిజన్లు.. అందుకేనా? - సమంత ఇన్​స్టాగ్రామ్ పోస్ట్​ వైరల్

తెలుగు ప్రముఖ కథానాయిక సమంతను ఓదార్చుతున్నారు నెటిజన్లు. ఆమెకు ధైర్యం చెబుతూ కామెంట్లు పెడుతున్నారు. ఇటీవల సమంత సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్​పై ఇలా స్పందిస్తున్నారు. అసలు సామ్​ ఏమని పోస్ట్​ చేసిందంటే?

smantas viral instagram post
smantas viral instagram post

By

Published : Oct 8, 2022, 10:55 AM IST

అగ్ర కథానాయిక సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఓ పోస్ట్​ చర్చనీయాంశంగా మారింది. తన పెంపుడు శునకం ఫొటోను శుక్రవారం రాత్రి షేర్‌ చేసిన సామ్‌.. ఆ పోస్ట్‌కి "వెనక్కి తగ్గా కానీ ఓడిపోలేదు" అని క్యాప్షన్‌ రాసింది. దీనిపై పలువురు సెలబ్రిటీలు స్పందించారు. "మోర్‌ పవర్‌ టు యూ, బీ స్ట్రాంగ్‌" అనే అర్థం వచ్చేలా ఎమోజీలతో కామెంట్స్‌ పెట్టారు. దీంతో ఈ పోస్ట్‌ వైరల్‌ అయ్యింది. సమంత తన వ్యక్తిగత జీవితాన్ని ఉద్దేశించే ఈ పోస్ట్‌ పెట్టారని అభిమానులు అంటున్నారు. 'ఏమైంది మేడమ్‌... ధైర్యంగా ఉండండి' అంటూ సమంతకు ధైర్యం చెబుతున్నారు.

జూన్‌ 16 తర్వాత..
సోషల్‌మీడియాలో చురుకుగా ఉండే సమంత గత కొంతకాలంగా ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో అంతగా కనిపించడం లేదు. తరచూ పర్సనల్‌ అప్‌డేట్స్‌ ఇచ్చే సామ్‌.. జూన్‌ 16 తర్వాత ఒక్క పోస్ట్‌ కూడా చేయలేదు. కేవలం సినిమాల అప్‌డేట్స్‌, ప్రచారకర్తగా వ్యవహరిస్తోన్న వాణిజ్య ప్రకటనలను మాత్రమే షేర్‌ చేస్తున్నారు. దీంతో సామ్‌ కెరీర్‌పై నెటిజన్లు విభిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. విడాకుల తర్వాత ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయంటూ మాట్లాడుకున్నారు.

ఈ క్రమంలో సామ్‌ పోస్ట్‌ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక, సమంత నటించిన 'యశోద', 'శాకుంతలం' నిర్మాణానంతర పనులు జరుపుకుంటున్నాయి. త్వరలో ఈ సినిమాలు విడుదల కానున్నాయి. మరోవైపు ఆమె వరుణ్‌ ధావన్‌తో కలసి చేయనున్న 'సిటాడెల్‌ ఇండియా' వెబ్‌సిరీస్‌ ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానుంది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా సిద్ధం కానున్న ఈ సిరీస్‌ కోసం ఆమె కసరత్తులు చేస్తున్నారు.

సమంత పోస్ట్

ఇవీ చదవండి:సూపర్​ 'జోడీలు' ఫిక్స్​.. సినిమాల కోసం ఫ్యాన్స్​ వెయిటింగ్​!

బాలీవుడ్​ 'బాద్​షా' భార్య గ్లామరస్​ లుక్స్​ చూశారా?

ABOUT THE AUTHOR

...view details