రానా నాయుడు వెబ్ సిరీస్‌కు సంబంధించి నెట్‌ఫ్లిక్స్ కీలక అప్డేట్ అందించింది. త్వరలోనే సీజన్ 2 రాబోతున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ స్వయంగా తమ అధికారిక సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. "నాయుడు అభిమానులారా.. మిమ్మల్ని ఉర్రూతలూగించడానికి మీలో జోష్ నింపడానికి 'రానా నాయుడు' సీజన్ 2 త్వరలో వస్తుంది" అని నెట్‌ఫ్లిక్స్ ఇండియా తమ ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించింది. ఈ సిరీస్‌లో రానా సోదరుడిగా నటించిన అభిషేక్ బెనర్జీ కూడా.. బుధవారం బిగ్ అనౌన్స్మెంట్ ఉండబోతోందని మంగళవారం ఒక వీడియోను తన ట్విట్టర్ అకౌంట్లో ట్వీట్ చేశారు.
హిందీలో రూపొందిన ఈ సిరీస్‌ను తెలుగు, తమిళ్, మలయళం భాషల్లో డబ్ చేశారు. రానా దగ్గుబాటి, విక్టరీ వెంకటేశ్ లు కీలక పాత్రలు పోషించిన ఈ సిరీస్ మాస్ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంది. సినిమాలకే పరిమితమైన విక్టరీ వెంకటేశ్ మొదటిసారి వెబ్ సిరీస్‌లో నటించారు. రానా తన నటనతో మరోసారి అభిమానుల అంచనాలు అందుకున్నారు. మార్చి 10న విడుదలైన రానా నాయుడు భారత్‌లో ఎక్కువ వ్యూస్ పొందిన సిరీస్‌గా నిలిచింది. మూడు వారాల పాటు మోస్ట్ వ్యూస్ ఆఫ్ ది సిరీస్‌గా దేశంలోనే నంబర్ 1 స్థానంలో ట్రెండ్ అయ్యింది. వరుసగా ఐదో వారంలోనూ భారతదేశంలోని టాప్ పది సిరీస్‌లలో ఒకటిగా కొనసాగుతోంది. నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ టాప్ 10లో నాన్-ఇంగ్లీష్ టీవీ షోలలో రానా నాయుడు.. విడుదల తర్వాత రెండు వారాల పాటు ట్రెండ్ అయ్యింది.