Neha Shetty Latest Pics : 'డీజే టిల్లు' సినిమాతో యంగ్ హీరోయిన్ నేహా శెట్టి క్రేజ్ అమాంతం పెరిగిపోయిన సంగతి తెలిసిందే. తన బోల్డ్ అండ్ హాట్ నెగటివ్ టచ్ పెర్ఫామెన్స్‌తో యూత్ ఫ్యూజులు ఎగిరిపోయేలా చేసింది. గ్లామర్ మెరుపులు మెరిపిస్తూ కూర్రాళ్ల దిల్కా 'రాధిక'గా మారిపోయింది. యూత్‌లో పుల్ క్రేజ్ అండ్ ఫాలోయింగ్ పెంచేసుకుంది. ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది.
దీంతో సోషల్‌మీడియాలో ఎక్కడ చూసిన అంతా ఈమెనె కనిపిస్తోంది. అయితే ఈ సినిమా సక్సెస్ ఇచ్చిన జోష్‌తో మరో మూడు చిత్రాలతో వరుసగా లైన్లో పెట్టింది. త్వరలోనే ఇవి ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. యంగ్ హీరో కార్తీకేయ సరసన 'బెదురులంక 2012'లో నటించింది. అలానే మాస్ కా దాస్ విశ్వక్ సేన్ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి', డైనమిక్ హీరో కిరణ్ అబ్బవరం సరసన 'రూల్స్ రంజన్'లోనూ నటిస్తోంది.
Gangs Of Godavari Nehashetty : ప్రస్తుతం ఈ మూడు చిత్రాలు ప్రమోషన్స్‌లో జోరు పెంచాయి. వరుసగా అప్డేట్స్ వదులుతున్నాయి. ఇందులో భాగంగానే.. రూల్స్ రంజన్ నుంచి 'సమ్మోహనుడా' సాంగ్, 'బెదురులంక 2012' ట్రైలర్, 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' నుంచి 'సుట్టంలా సూకి పోకలా' సాంగ్, రిలీజై అయి బాగా ఆకట్టుకున్నాయి. ఇందులో నెహా శెట్టి గ్లామర్, లుక్స్ అభిమానులను హీటెక్కింటాయి. దీంతో మరోసారి ఈ ముద్దుగుమ్మ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది.