సినీ కార్మికులు ఆందోళన విరమించారు. వేతనాల పెంపుపై నిర్మాతల మండలి నుంచి స్పష్టమైన హామీ రావడంతో తమ ఆందోళన విరమించి రేపటి నుంచి సినిమా చిత్రీకరణలకు హాజరుకానున్నట్లు ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు వెల్లడించారు. వేతనాల పెంపుపై రెండు రోజుల నుంచి ఆందోళన బాట పట్టిన సినీ కార్మిక సంఘాలు... సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని చొరవతో నిర్మాతల మండలితో చర్చలు జరిపారు.
ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ మధ్య చర్చలు సఫలం.. దిల్‌రాజు అధ్యక్షతన కమిటీ - Negotiations were successful
ఫిలిం ఛాంబర్, ఫిలిం ఫెడరేషన్ మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో షూటింగ్స్‌కు యథావిధిగా హాజరు కానున్నట్లు సినీ కార్మిక సంఘాల నాయకులు ప్రకటించారు.
ఈ చర్చల్లో సినీ కార్మికుల సమస్యలు, వేతనాల పెంపుపై సుమారు 2 గంటలపాటు చర్చించారు. సినీ కార్మికుల వేతనాలపై దిల్ రాజు అధ్యక్షతన సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు నిర్మాతల మండలి ప్రకటించింది. రేపు సమన్వయ కమిటీ సమావేశంలో చర్చించి వేతనాలపై తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. కార్మికుల సమస్యలను సమన్వయ కమిటీ ద్వారా పరిష్కరించుకుంటామని, వేతనాల పెంపునకు నిర్మాతలు అంగీకారం తెలపడంతో రేపటి నుంచి సినిమా చిత్రీకరణలు యథాతథగా జరుగుతాయని ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు తెలిపారు.
ఇదీ చదవండి:'ఆర్ఆర్ఆర్' సరికొత్త రికార్డు.. భారత్ నుంచి అత్యంత ఆదరణ పొందిన చిత్రంగా..