భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా 'ఇండియన్ ఆఫ్ ది ఇయర్' ఈవెంట్‌లో సందడి చేశాడు. దిల్లీ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో నీరజ్ చోప్రాతో పాటు టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ సహా మరికొంత మంది ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంటర్‌టైన్‌మెంట్ కేటగిరీలో అల్లు అర్జున్ పాన్ ఇండియా సినిమా పుష్ప.. 'ఇండియన్ ఆఫ్ ది ఇయర్' అవార్డు అందుకోగా.. క్రీడా విభాగంలో నీరజ్ చోప్రా ఈ అవార్డు ముద్దాడాడు.
ఒకే వేదికపై బన్నీ, నీరజ్ చోప్రా, రణ్‌వీర్.. చిందులేస్తూ హంగామా - నీరజ్ చోప్రా అల్లుఅర్జున్ డ్యాన్స్
ఐకాన్‌స్టార్ అల్లుఅర్జున్, బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్‌తో కలిసి సందడి చేశాడు స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా. వారితో కలిసి చిందులేశాడు. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే ఒకే వేదికను నీరజ్ చోప్రా, అల్లు అర్జున్ పంచుకోవడంతో సందడి వాతావరణం నెలకొంది. ఇద్దరు కలిసి ఫోటోలకు ఫోజిచ్చి కాసేపు సరదాగా ముచ్చటించారు. ఈ క్రమంలో నీరజ్.. బన్నీ ఫేమస్ డైలాగ్ 'తగ్గేదే లే' మేనరిజంను చేసి చూపించాడు. అలాగే బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్‌తో కలిసి స్టేజ్ పై డ్యాన్స్‌తో అదరగొట్టాడు నీరజ్. ప్రస్తుతం వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మీరు చూసేయండి..
ఇదీ చూడండి: 'సూపర్ మ్యాన్'లా స్టోక్స్.. కళ్లు చెదిరే విన్యాసానికి నెటిజన్లు ఫిదా!