NBK Unstoppable 2: కొలతలు తీసుకుంటానన్న బాలయ్య.. పగలబడి నవ్విన పవన్! - NBK Unstoppable 2 latest episode
పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అప్డేట్ రానే వచ్చింది. ఎన్బీకే అన్‌స్టాపబుల్ పవన్ కల్యాణ్ గ్లింప్స్ రిలీజయ్యింది. దీంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ గురించి ఓ లేటెస్ట్ అప్డేట్ రిలీజ్ చేసింది ఆహా టీమ్. ఎన్బీకే అన్‌స్టాపబుల్ సీజన్ 2 ఎపిసోడ్‌కి సంబంధించిన ఆ గ్లింప్స్‌ను విడుదల చేశారు. 'నేను నీ కొలతలు తీసుకుంటా' అంటూ బాలయ్య అనగానే.. పవణ్ కల్యాణ్ పగలబడి నవ్వారు. గ్లింప్స్ రిలీజయ్యేకంటే ముందు నుంచే సంబరాలు చేసుకున్నారు ఫ్యాన్స్. ట్విట్టర్లో హ్యాష్‌ట్యాగులతో ట్రెండింగ్ సైతం చేశారు. గ్లింప్స్‌లో పవన్ అవుట్‌ఫిట్ కేక అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరోవైపు ఎపిసోడ్లో ఎటువంటి ప్రశ్నలు ఉండనున్నాయో అని ఆసక్తి కనబరుస్తున్నారు.