తెలంగాణ

telangana

By

Published : Oct 27, 2022, 5:20 PM IST

ETV Bharat / entertainment

అన్​స్టాపబుల్​ మూడో ఎపిసోడ్​ ప్లాన్​ ఛేంజ్​.. మరిన్ని సీక్రెట్స్​తో చంద్రబాబే గెస్ట్​గా!

అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అన్ స్టాపబుల్ మూడో ఎపిసోడ్ విషయంలో ఓ చిన్న మార్పు చేశారు మేకర్స్. ఈ సారి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గెస్ట్​గా వచ్చిన తొలి ఎపిసోడ్​కు సంబంధించిన అన్​సెన్సార్​ వీడియో స్ట్రీమింగ్ అవ్వబోతున్నట్లు తెలిపారు.

nbk chandrababu
బాలయ్య ఎన్​బీకే చంద్రబాబు

వెండితెరపైనే కాకుండా బుల్లితెరపైనా నందమూరి నటసింహం బాలకృష్ణ ఫుల్​ జోష్​తో ప్రేక్షకులను మజా అందిస్తున్నారు. ముఖ్యంగా ఓటీటీలో ప్లాట్​ఫామ్​ ఆహాలో అన్​స్టాపబుల్​తో అయితే ప్రేక్షకులను ఊపేస్తున్నారు. ఇటీవలే ప్రారంభమైన రెండో సీజన్​లో ఇప్పటికే ప్రసారమైన రెండు ఎపిసోడ్​లను పూర్తి చేసుకుని వీక్షకులను బాగా ఆకట్టుకుంది. తొలి ఎపిసోడ్​లో నారా చంద్రబాబు నాయుడు, లోకేష్​, రెండో ఎపిసోడ్​లో యంగ్ హీరోలు విశ్వక్​సేన్​, సిద్ధు జొన్నలగడ్డ విచ్చేసి సందడి చేశారు. ఈ రెండు ఆద్యంతం ఆసక్తిగా, ఫన్​గా సాగింది.

ముఖ్యంగా ఈ రెండో సీజన్​ నారా చంద్రబాబు నాయుడు ఆయన తనయుడు నారా లోకేష్​తో మొదలుపెట్టడంతో వీక్షకుల్లో మరింత ఆసక్తిని రేకెత్తించింది. అందుకు తగ్గట్టుగానే వివాదాస్పద అంశాలపై బాలయ్య ప్రశ్నలు వేయడం.. అందుకు చంద్రబాబు నాయుడు స్పందించడం జరిగింది. బావబావమరిది హంగామాగా సాగిన ఈ ఫస్ట్​ ఎపిసోడ్ ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే వుంది. యుక్త వయసులో చేసిన అల్లరి పనుల నుంచి సీనియర్ ఎన్టీఆర్​ రాజకీయ విషయాలు, వైఎస్ రాజశేఖర్ రెడ్డితో తనకున్న స్నేహం.. ఇలా పలు అంశాల గురించి చంద్రబాబు బయటపెట్టిన తీరు వీక్షకుల్ని ఆకట్టుకోవడంతో పాటు ఆశ్చర్యానికి గురిచేసింది.

దీంతో మూడో ఎపిసోడ్​ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. అయితే మేకర్స్​ ఈ వారం షోలో కాస్త మార్పు చేశారు. మూడో ఎపిసోడ్​ త్వరలోనే వస్తుందని చెప్పిన మేకర్స్​.. నేడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఆసక్తిగా సాగిన తొలి ఎపిసోడ్​కు సంబంధించిన అన్​సెన్సార్​ వీడియోను స్ట్రీమింగ్​ కాబోతున్నట్లు తెలిపారు. మోర్​ ఫన్​ అండ్​ మోర్​ సీక్రెట్స్​ పేరుతో ఈ ఎపిసోడ్​ రాత్రి 12 గంటల నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు పేర్కొన్నారు. ఇందులో బాబు... బాలయ్యకు ఇంకా ఎలాంటి సీక్రెట్స్​ చెప్పారో చూపించబోతున్నారు. కాగా, మూడో ఎపిసోడ్​లో సీనియర్ నటి రమ్యకృష్ణ గెస్ట్​గా రానుంది. ప్రస్తుతం బాలయ్య షూటింగ్​లో బిజీ ఉండటం కారణంగా ఈ ఎపిసోడ్​ ఆలస్యం అయినట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి:పోలీసులను ఆశ్రయించిన పూరి జగన్నాథ్​.. ఆ డిస్ట్రిబ్యూటర్స్ బెదిరిస్తున్నారని

నయన్‌-విఘ్నేశ్‌ సరోగసీ.. విచారణ కమిటీ నివేదికలో ఏం చెప్పిందంటే?

ABOUT THE AUTHOR

...view details