తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

బాలయ్య మ్యాజిక్​.. పోటీ పడుతున్న యంగ్​ డైరెక్టర్స్​! - బాలకృష్ణ పుట్టినరోజు

నందమూరి బాలకృష్ణతో సినిమా చేసేందుకు కొంతమంది యంగ్ డైరెక్టర్స్​ పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలు..

Balakrishna
బాలయ్య మ్యాజిక్​.. పోటీ పడుతున్న యంగ్​ డైరెక్టర్స్​!

By

Published : Jun 5, 2023, 9:05 AM IST

Updated : Jun 5, 2023, 9:16 AM IST

Balakrishna Upcoming movies : నటసింహం నందమూరి బాలకృష్ణ వెంట ఇప్పుడు యువ దర్శకులు పడుతున్నారా? ఆయనతో సినిమా చేసేందుకు పోటీ పడుతున్నారా? అంటే.. ప్రస్తుత పరిస్థితి అలానే కనిపిస్తోంది. సినిమాల పరంగా 60 ప్లస్​లో బాలయ్య మంచి జోరు మీదున్నారు. 'అఖండ' సక్సస్, 'అన్​స్టాపబుల్​'షోతో ఆయన క్రేజ్​, రేంజ్​ మరింత పెరిగిపోయిన సంగతి తెలిసిందే. దీంతో బాలయ్య కూడా తన లైనప్​ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు. అలా ఈ ఏడాది గోపిచంద్ మలినేని దర్శకత్వంలో 'వీరసింహారెడ్డి'తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో సక్సెస్​ను ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం NBK 108 సినిమాలో నటిస్తున్నారు. దీనికి అనిల్​ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సరికొత్త బాలయ్యను చూపించబోతున్నామని మూవీటీమ్​ చెబుతోంది. తెలంగాణ బ్యాక్​డ్రాప్​లో సాగే కథ కావడం వల్ల.. బాలయ్య డైలాగ్స్​, లుక్​ ప్రతీది కొత్తగా ఉండబోతుందని అంటోంది.

Balakrishna 109 movie : ఇక దీని తర్వాత NBK 109, 110 చిత్రాలను మరింత స్పెషల్​గా ప్లాన్ చేసుకుంటున్నారట బాలయ్య. దీంతో ఆయన్ను డైరెక్ట్​ చేసేందుకు యంగ్​ డైరెక్టర్స్​ కొంతమంది పోటీపడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురి పేర్లు కూడా వరుసగా వినిపించాయి. 'వాల్తేరు వీరయ్య'తో హిట్​ అందుకున్న బాబీ, 'బింబిసార' ఫేమ్ వశిష్ట, 'అ!', 'జాంబిరెడ్డి' ఫేమ్​ ప్రశాంత్​ వర్మ లాంటి వారు ఆయన్ను కలిశి స్టోరీ లైన్స్​ కూడా చెప్పారట! ఇవి బాలయ్యకు కూడా నచ్చాయట. ప్రస్తుతం స్టోరీ డెవలప్​మెంట్​లు జరుగుతున్నాయని తెలుస్తోంది. అయితే ఎవరి తర్వాత ఎవరితో చేస్తారనేది తెలియదు కానీ.. వీరందరితో సినిమాలు చేసేందుకు నటసింహం రెడీగా ఉన్నారని అంటున్నారు. రీసెంట్​గా మరో ప్రచారం కూడా తెరపైకి వచ్చింది. బోయపాటి శ్రీనుతో కూడా మరో సినిమా ఫిక్స్​ అయిందని అన్నారు. NBK 109గా రూపొందే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఒకవేళ ఇదే కనుక నిజమైతే దీని తర్వాత యంగ్ డైరెక్టర్స్​తో బాలయ్య సినిమా చేసే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ.. బాలయ్య కోసం ఇలా నవతరం దర్శకులు పోటీ పడటం విశేషం. చూడాలి మరి ఏం జరుగుతుందో..

కాగా, NBK 108 సినిమా విషయానికొస్తే.. సాహు గారపాటి, హరీష్‌ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రీలీల కీలక పాత్ర పోషిస్తోంది. కాజల్ అగర్వాల్​.. బాలయ్య సరసన నటిస్తోంది. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. మరో కీలక పాత్ర కోసం నటుడు శరత్‌ కుమార్​ను రంగంలోకి దించింది చిత్ర బృందం. ఈ సినిమాకి తమన్‌ సంగీతం అందిస్తున్నారు. తమ్మిరాజు కూర్పు, సి.రామ్‌ప్రసాద్‌ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.

ఇదీ చూడండి :

Last Updated : Jun 5, 2023, 9:16 AM IST

ABOUT THE AUTHOR

...view details