తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

NBK 109 : బాక్స్​లో గొడ్డలి, కత్తి, మందు బాటిల్!.. బాలకృష్ణతో బాబీ ప్లాన్ ఏంటి? - ఎన్​బీకే 109 బాబీ ప్లాన్​

NBK 109 Movie : నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వం వహిస్తున్న సినిమా పూజ కార్యక్రమాలంతో మొదలైంది. అయితే కాన్సెప్ట్ పోస్టర్, ఒక్క మాటతో సినిమాపై దర్శకుడు బాబీ అంచనాలు పెంచేశారు. మరి ఆ కాన్సెప్ట్​ పోస్టర్​ చూశారా?

nbk-109-balakrishna-bobby-kolli-movie-begins-with-pooja-concept-poster
nbk-109-balakrishna-bobby-kolli-movie-begins-with-pooja-concept-poster

By

Published : Jun 10, 2023, 5:21 PM IST

Updated : Jun 11, 2023, 9:11 AM IST

NBK 109 Movie : 'వయలెన్స్​కు విజిటింగ్ కార్డ్'.. ఇది నటసింహం నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా గురించి చిత్ర బృందం ఒక్క లైన్​లో చెప్పిన మాట! అంతే కాదు శనివారం ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్​ను కూడా రిలీజ్ చేశారు. దాన్ని మనం చూస్తే బాలకృష్ణతో డైరెక్టర్​ బాబీ యాక్షన్ సీన్లు గట్టిగా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.

గొడ్డలి, సుత్తి, కత్తి.. ఇలా ఎన్‌బీకే 109 కాన్సెప్ట్ పోస్టర్‌లో చాలా మారణాయుధాలు ఉన్నాయి. ఈ ఆయుధాలతో బాలకృష్ణతో డిఫరెంట్ యాక్షన్ సీన్లు తీయొచ్చనట్లు బాబీ అనుకున్నారేమో. కత్తులతో పాటు ఆ సూట్ కేసులో మందు బాటిల్ కూడా ఉంది. అది 'మ్యాన్షన్ హౌస్' బాటిల్ కావడం విశేషం. అలాగే.. సిగరెట్, డబ్బులకూ చోటు కల్పించారు.

NBK 109 : బాక్స్​లో గొడ్డలి, కత్తి, మందు బాటిల్

వచ్చే ఏడాది NBK 109 రిలీజ్​
బాలకృష్ణ కథానాయకుడిగా బాబీ కొల్లి (కె.ఎస్. రవీంద్ర) దర్శకత్వంలో సినిమా శనివారం.. పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు తెరకెక్కిస్తున్న చిత్రమిది. త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య, సూర్యదేవర నాగవంశీ నిర్మాతలు. వచ్చే ఏడాది ప్రథమార్థంలో చిత్రాన్ని విడుదల చేస్తామని వెల్లడించారు.

నాగవంశీకి బాబీ థాంక్స్
బాలకృష్ణ గారితో పని చేసే అవకాశం రావడం, అదీ ఆయన పుట్టినరోజున సినిమా ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని దర్శకుడు బాబీ ట్వీట్ చేశారు. ఈ రోజు పూజ జరిగిందని తెలిపారు. ఈ సినిమా మొదలు కావడానికి కారణమైన ఎస్. నాగవంశీతో పాటు నిర్మాణ సంస్థలకు ఆయన థాంక్స్ చెప్పారు. బాలకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు.

బాలకృష్ణతో త్రివిక్రమ్ సందడి!
కథానాయకుడిగా బాలకృష్ణ 109వ చిత్రమిది. ప్రారంభోత్సవంలో నట సింహంతో మాటల మాంత్రికుడు సందడి చేశారు. ఇద్దరూ మాట్లాడుకుంటున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎన్‌బీకే ప్రారంభోత్సవానికి ఎన్టీఆర్ కుమారుల్లో ఒకరైన నందమూరి రామకృష్ణ, మైత్రీ మూవీ మేకర్స్ అధినేతల్లో ఒకరైన వై.రవి శంకర్ తదితరులు హాజరయ్యారు.

వీరయ్య డైరెక్టర్​- వీర హీరో..
సంక్రాంతి బరిలో.. జనవరి నెలలో విడుదలైన తెలుగు సినిమాల్లో 'వీర సింహా రెడ్డి', 'వాల్తేరు వీరయ్య' ఉన్నాయి. మొదటి సినిమాలో హీరో బాలకృష్ణ కాగా.. రెండో సినిమాకు బాబీ కొల్లి దర్శకుడు. ఇప్పుడు వీళ్లిద్దరూ కలిసి సినిమా చేస్తుండటం విశేషం. బాలకృష్ణ మాస్ ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని బాబీ మంచి కథ రెడీ చేశారట. 'వాల్తేరు వీరయ్య'లో మెగాస్టార్ చిరంజీవిని బాబీ ప్రజెంట్ చేసిన తీరు అభిమానులకు నచ్చింది. ఇప్పుడు బాలకృష్ణను సైతం అభిమానులు కోరుకునే విధంగా చూపించాలని డిసైడ్ అయ్యారట.

Last Updated : Jun 11, 2023, 9:11 AM IST

ABOUT THE AUTHOR

...view details