Balakrishna Bhagwant Kesari Movie Release Date : సినిమాలు, రాజకీయాలు, సామాజిక సేవా కార్యక్రమాలు, ఓటీటీ అన్‌స్టాపబుల్ టాక్ షో.. అంటూ 60ఏళ్ల వయసులోనూ ఫుల్ జోష్‌గా కెరీర్లో ముందుకెళ్తున్నారు నందమూరి నటసింహం బాలకృష్ణ. అలా తన ఉత్సాహంతో అటు అభిమానుల్ని ఇటు సినీ ప్రియులన్ని అలరిస్తున్నారు. మరోవైపు ప్రజల మనసులను గెలుచుకుంటున్నారు.
అయితే 'అఖండ', 'వీరసింహారెడ్డి' వంటి చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్లను అందుకున్న బాలయ్య.. ప్రస్తుతం ఫన్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో కలిసి 'భగవంత్ కేసరి' అనే ఫన్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ సినిమా చేస్తున్నారు. I Don't Care అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమాలో బాలయ్యకు హీరోయిన్గా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఆయన భార్య పాత్రలో కనిపించనుందని సమాచారం. టాలీవుడ్ యంగ్ సెన్సేషనల్ శ్రీలీల, సీనియర్ నటుడు శరతకుమార్ ఇతర కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఈ సందర్భంగా ఇప్పటి నుంచి సినిమా అప్డేట్స్ను వరుసగా ప్రకటిస్తూ అభిమానుల్లో జోష్ నింపుతోంది మూవీటీమ్. తాజాగా మరో కొత్త మాసివ్ బిగ్ అప్డేట్ను ఇచ్చింది. భగవంత్ కేసరి సినిమా నుంచి కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఈ సినిమా దసరా కానుకగా.. అక్టోబరు 19న విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ మరోసారి అధికారికంగా ప్రకటించింది. 'భగవంత్ కేసరి ఆయుధ పూజతో గీ సారి దసరా జోర్దారుంటది' అని యూనిట్ తెలిపింది.
ఇటీవలే విడుదల చేసిన టీజర్‌కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలంగాణ యాసలో బాలయ్య తన డైలాగ్‌లు, యాక్టింగ్‌తో అదరగొట్టేశారు. ఇది అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. ఇకపోతే ఈ సినిమాలో బాలీవుడ్ ప్రముఖ నటుడు అర్జున్ రాంపాల్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహూ గారపాటి - హరీష్ పెద్ది కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఫ్లోర్ స్టెప్‌తో రచ్చ రచ్చే .. ఈ సినిమాలోని పాటల్లో బాలయ్యకు కళ్లు చెదిరే స్టెప్పులు పెట్టారని ఆ మధ్యలో వార్తలు వచ్చాయి. ఇప్పటికే బాలయ్య 'లెజెండ్', 'అఖండ', 'వీర సింహారెడ్డి' చిత్రాల్లో బ్లాక్ బాస్టర్ స్టెప్పులు అభిమానుల్ని అలరించారు. ఇప్పుడు 'భగవంత్ కేసరి'లోనూ ఓ సాంగ్‌లో బాలయ్య సూపర్ స్టెప్పులు వేయనున్నారట. ఈ సారి ఏకంగా ఫ్లోర్ స్టెప్ వేయనున్నారని ఆ మధ్య ప్రచారం కూడా సాగింది. దీనికోసం పది రోజుల పాటు బాలయ్య ప్రాక్టీస్ కూడా చేశారని అన్నారు.