తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

NBK 108: 'అన్న దిగిండు.. ఈ సారి మీ ఊహకు మించి'.. బాలయ్య ఫస్ట్​ లుక్​ చూశారా?​

హీరో నందమూరి బాలకృష్ణ తదుపరి చిత్రం NBK108 నుంచి క్రేజీ అప్డేట్​ వచ్చింది. ఉగాది పండుగ సందర్భంగా బాలయ్య లుక్​ను మేకర్స్​ విడుదల చేశారు. నటిసింహం మాస్​ లుక్​ అదిరిపోయిందని ఫ్యాన్స్​ అంటున్నారు.

nbk 108 movie update hero nandamuri balakrishna first look released
nbk 108 movie update hero nandamuri balakrishna first look released

By

Published : Mar 22, 2023, 10:21 AM IST

Updated : Mar 22, 2023, 10:40 AM IST

వరుసగా యాక్షన్ సినిమాలు చేస్తూ యువ హీరోలకు సవాళ్‌ విసురుతున్నారు నందమూరి బాలకృష్ణ. గతేడాది విడుదలైన 'అఖండ'లో బాలయ్య నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ముఖ్యంగా అఘోర పాత్రలో బాలకృష్ణ నటన అద్భుతం. అదే ఊపు​లో వీరసింహా రెడ్డి చిత్రంలో నటించారు. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ఆ సినిమా.. విజయం సాధించింది. ఇప్పుడే అదే జోష్​లో బాలయ్య.. తన 108వ సినిమా చేస్తున్నారు. అనిల్​ రావిపూడి దర్శకత్వంలో NBK 108 వర్కింగ్​ టైటిల్​తో ఈ సినిమాతో తెరకెక్కుతోంది.

తెలుగు నూతన సంవత్సరాది ఉగాది పండుగను పురస్కరించుకుని NBK 108 చిత్రబృందం.. హీరో నందమూరి బాలకృష్ణ ఫస్ట్ లుక్​ను విడుదల చేసింది. 'ఈ సారి మీ ఊహకు మించి' అంటూ నటహింహం పోస్టర్లను రిలీజ్​ చేసింది. బాలయ్య మాస్​ లుక్​లో అదిరిపోయారని ఫ్యాన్స్​ అంటున్నారు. సూపర్​ అప్డేట్​తో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం బాలయ్య ఫస్ట్​ లుక్​ వైరల్​గా మారింది. నటసింహం లుక్​ చూసిన అభిమానులు.. ఈ సినిమా కూడా సూపర్​ హిట్​ పక్కా అని అంటున్నారు.

నందమూరి బాలకృష్ణ

ఇటీవలే ఈ సినిమాలో హీరోయిన్​గా కాజల్​ అగర్వాల్ నటిస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఈ విషయాన్ని తెలియజేసేలా మూవీ యూనిట్​ ఓ పోస్టర్​ను కూడా విడుదల చేసింది. కెరీర్​లో తొలిసారి బాలయ్య.. కాజల్​తో జతకడుతున్నారు. దీంతో వీరిద్దరి కాంబోపై హైప్​ పెరిగింది. ఇక ఈ సినిమాలో నటి శ్రీలీల కీలక పాత్ర పోషిస్తున్నారు. బాలయ్య కుమార్తెగా నటిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం బాలయ్య, కాజల్​, శ్రీలీల మీద కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. షైన్‌ స్క్రీన్‌ బ్యానర్​పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎస్​ఎస్​ తమన్ సంగీత స్వరాలు సమకూరుస్తున్నారు. ఎన్​బీకే108 సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది.

నందమూరి బాలకృష్ణ

మరోవైపు, ఈ సినిమాలో బాలయ్య ఓల్డ్ సూపర్ హిట్​ సాంగ్​ను రీమిక్స్​ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. బాలకృష్ణ కెరీర్​లో సూపర్ హిట్ అందుకున్న సమరసింహారెడ్డిలోని 'అందాల ఆడబోమ్మ' సాంగ్​ను మళ్లీ రీమిక్స్ చేయబోతున్నారట. దీనికి తమన్ సంగీతం అందించనున్నారట. ఒకవేళ ఇదే కనుక జరిగితే.. తమన్‌ మ్యూజిక్​లో ఆ సాంగ్ రీమిక్స్ అదిరిపోతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఈ చిత్రం తెలంగాణ బ్యాక్ డ్రాప్​లో సాగుతుందని ప్రచారం జరుగుతోంది. బాలయ్యను అనిల్​ సరికొత్త లుక్​లో చూపించబోతున్నారని వినికిడి.

Last Updated : Mar 22, 2023, 10:40 AM IST

ABOUT THE AUTHOR

...view details