తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఎన్టీఆర్​ శత జయంతి.. నందమూరి ఫ్యామిలీ సినిమా సర్​ప్రైజెస్​ ఇవే! - NBK 107

సీనియర్​ ఎన్టీఆర్​ శత జయంతి సందర్భంగా.. నందమూరి కుటుంబసభ్యులు తమ కొత్త సినిమాల అప్డేట్స్​ను ఇచ్చి అభిమానుల్లో జోష్​ను నింపారు. ఓసారి అవన్నీ చూసేద్దాం..

Nandamuri new hero
నందమూరి కుటుంబం నుంచి మరో వారసుడు

By

Published : May 28, 2022, 4:58 PM IST

Updated : May 28, 2022, 5:23 PM IST

నేడు సీనియర్​ ఎన్టీఆర్​ శత జయంతి సందర్భంగా.. నందమూరి కుటుంబసభ్యులు ఆయన్ను స్మరించుకుంటూ నివాళులు అర్పించారు. అలానే తమ కొత్త సినిమాల అప్డేట్స్​ను ఇచ్చి అభిమానుల్లో జోష్​ను నింపారు. ఓ సారి వాటిని చూసేద్దాం..
Nandamuri new hero: నందమూరి కుటుంబం నుంచి మరో వారసుడు హీరోగా తెరంగేట్రం చేస్తున్నాడు. ఎన్టీఆర్ పెద్ద కుమారుడు నందమూరి జయకృష్ణ తనయుడు చైతన్య కృష్ణను హీరోగా పరిచయం చేస్తూ బసవతారకరామ క్రియేషన్స్ పేరుతో కొత్త బ్యానర్​ను స్థాపించారు. ఎన్టీఆర్ శత జయంతిని పురస్కరించుకొని ఆ బ్యానర్​ను నందమూరి బాలకృష్ణ లాంఛనంగా ఆవిష్కరించారు. 'తండ్రి తర్వాత తండ్రిలాంటి సోదరుడు జయకృష్ణ.. అమ్మానాన్న పేర్లు కలిసి వచ్చేలా బ్యానర్ పెట్టడం ఆనందంగా ఉంద'న్నారు. ఎన్టీఆర్​కు చైతన్య కృష్ణ చాలా ఇష్టమైన మనవడని, ప్రేక్షకుల అభిమానాన్ని పొందాలని మనసారా ఆశీర్వదిస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రానికి వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వం వహిస్తున్నారు.

నందమూరి కుటుంబం నుంచి మరో వారసుడు హీరోగా ఎంట్రీ

NBK 107 new poster: అఖండ ఘన విజయం తర్వాత బాలకృష్ణ నటిస్తున్న 107వ చిత్రం జోరుగా చిత్రీకరణ జరుపుకుంటోంది. గోపీచంద్ మలినేనిదర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్పటికే 40 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తూ చిత్ర బృందం ఎన్​బీకే 107 చిత్రానికి సంబంధించి కొత్త పోస్టర్​ను అభిమానులతో పంచుకుంది. టెంపుల్ బ్యాక్ డ్రాప్​లో రక్తంతో నిండిన కత్తిపట్టుకున్న బాలకృష్ణ ఉగ్రరూపంలో కనిపిస్తున్న పోస్టర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేలా చేస్తోంది.

బాలకృష్ణ 107

Kalyanaram Bimbisara movie: కల్యాణ్‌రామ్‌ కథా నాయకుడిగా వశిష్ట తెరకెక్కిస్తున్న చిత్రం 'బింబిసార'. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై కె.హరికృష్ణ నిర్మిస్తున్నారు. కేథరిన్‌, సంయుక్త మేనన్‌ కథానాయికలు. నేడు సీనియర్ ఎన్టీఆర్​ శత జయంతి సందర్భంగా తన తాతను గుర్తుచేసుకుంటూ ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్​ను పోస్ట్ చేశారు హీరో కల్యాణ్ రామ్. ఈ పోస్టర్‌లో ఆయన స్టైలిష్‌ లుక్‌లో కనిపించారు. ఈ సినిమాకి చిరంతన్‌ భట్‌ స్వరాలందిస్తున్నారు.

బింబిసార

Tarakratna mahesh babu movie: 'అతడు', 'ఖలేజా' చిత్రాల తర్వాత సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో ఓ ప్రాజెక్ట్‌ ఓకే అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం నెట్టింట్లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నందమూరి నటుడు తారకరత్న ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించే అవకాశం ఉన్నట్లు గత కొద్ది రోజులుగా నెట్టింట్లో ప్రచారం సాగుతోంది. అయితే ఇది ఓకే అయినట్లు తెలుస్తోంది. తారకరత్న పేరుతో ఉన్న ఓ ట్విట్టర్‌ ఖాతా నుంచి #SSMB 28 Loading అని తాజాగా ఓ ట్వీట్‌ బయటకువచ్చింది. ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కాగా, తారకరత్న పేరుతో ఉన్న ట్విట్టర్‌ ఖాతా అధికారిక పేజీ కాదు.

ఇదీ చూడండి: ఎన్టీఆర్.. కెరీర్​లోనే ఎక్కువ టేకులు తీసుకున్న సినిమా ఏంటంటే?

Last Updated : May 28, 2022, 5:23 PM IST

ABOUT THE AUTHOR

...view details