Nayanthara Vignesh Shivan Movie : గత రెండు దశాబ్దాలుగా ఇటు తెలుగుతో పాటు అటు తమిళంలోనూ సక్సెస్ఫుల్ హీరోయిన్గా రాణించడం అంటే మాటలు కాదు. ఈ కోవకు చెందిన నటీమణులు అరుదనే చెప్పాలి. అలా తన కెరీర్ తొలినాళ్ల నుంచి ఇప్పటి వరకు అదే స్టార్డమ్ను మెయిన్టెయిన్ చేస్తూ సక్సెస్ఫుల్గా దూసుకెళ్తోంది తమిళ నటి నయనతార. తన అందం, అభినయంతో ఇప్పటికీ కుర్రకారులో క్రేజ్ సంపాదించుకుంటోంది. 'జవాన్' సినిమా సక్సెస్ను ఆస్వాదిస్తున్న ఈ భామ ప్రస్తుతం కోలీవుడ్లో వరుస ప్రాజెక్టులకు సైన్ చేస్తూ బిజీ బిజీగా ఉంది. తాజాగా 'అన్నపూరణి' అనే లేడీ ఓరియెంటడ్ సినిమాలోనూ నటించింది. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో రన్ అవుతోంది.
ఇక తన తొలి సినిమా నుంచి ఇప్పటి వరకు ఈమె హీరోయిన్ రోల్స్ తప్ప ఇంకోటి చేయలేదు. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్లో తెరకెక్కిన గాడ్ ఫాదర్ సినిమాలో మాత్రం చిరుకు సోదరిగా నటించింది. అయితే తాజాగా ఈ చిన్నది ఓ యంగ్ హీరోకు అక్క గా నటించనున్నారట. అది తన భర్త విఘ్నేశ్ శివన్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమాలో.
వివరాల్లోకి వెళ్తే.. 'లవ్ టుడే' సినిమాతో సెస్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ కమ్ హీరో ప్రదీప్ రంగనాథన్ లీడ్ రోల్లో డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ ఓ సినిమాను ప్లాన్ చేశారట. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ జాన్వీ కపూర్ ని ఒప్పించేందుకు ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయట. ఈ క్రమంలో హీరో అక్క పాత్రలో నయన్ మెరవనున్నారట. ఈ సినిమాలో ఇదే చాలా కీలకమైన పాత్ర అని టాక్. అయితే ఈ విషయంపై మూవీ మేకర్స్ ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయలేదు.