కోలివుడ్ ఇండస్ట్రీకి ఖైదీ, విక్రమ్ లాంటి హిట్ సినిమాలను అందించి టాప్ డైరెక్టర్ల జాబితాలో చేరిన దర్శకుడు లోకేశ్ కనగరాజ్. ఈయనతో సినిమాలు చేసేందుకు అటు కోలీవుడ్‌తో పాటు ఇటు టాలీవుడ్‌లోని టాప్ స్టార్స్ అందరూ ఆసక్తి కనబరుస్తున్నారు. ఇలా వరుస సినిమాలతో హిట్లను ఆస్వాదిస్తున్న లోకేశ్ దళపతి విజయ్‌తో ఓ సినిమా చేయబోతున్నట్లు సమాచారం.
మరో హారర్ సినిమాలో నయన్.. ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్! - నయనతార లేటెస్ట్ అప్డేట్స్
ఖైదీ, విక్రమ్ లాంటి హిట్ సినిమాలను అందించిన టాప్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ సినిమాలో నయన్ ఓ సినిమా సైన్ చేసిందట. ఆ మూవీలో మరో యాక్టర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన ఎవరంటే..
ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్న ఈ సినిమాతో లోకేశ్ నిర్మాతగా మారనున్నారట. కమల్‌హాసన్ నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఇంటర్‌నేషనల్ ఫిల్మ్స్‌తో లొకేశ్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ హారర్ థీమ్ మూవీ గురించి మరో ఆసక్తికరమైన అప్డేట్ వెలుగులోకి వచ్చింది. ఓ వైపు దర్శకుడు మరోవైపు నిర్మాతగా వ్యవహరిస్తున్న లోకేశ్ ఈ సినిమాకు కథను సైతం రాశారట.
దళపతి విజయ్‌కు జోడీగా లేడీ సూపర్ స్టార్ నయన్ ఈ సినిమాలో సండది చేయన్నున్నట్లు సమాచారం. అంతే కాకుండా రాఘవ లారెన్స్ సైతం ఈ సినిమాలో ప్రధాన పాత్రను పోషించనున్నట్లు టాక్. రత్నకుమార్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాకు సంబంధించిన అధికారిక అప్డేట్ను త్వరలోనే రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. అయితే నయన్ లారెన్స్ కలిసి నటించడం ఇదే తొలిసారి. ప్రస్తుతం లారెన్స్ చంద్రముఖి -2 సినిమా షూటింగ్లో బీజీగా ఉన్నాడు. మరోవైపు నయనతార జవాన్ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనుంది. అట్లీ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో షారుఖ్‌ఖాన్ హీరోగా నటిస్తున్నాడు.