తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

గజినీతో లైఫ్​ టర్న్​- పేరు మార్చేసిన డైరెక్టర్​- నయన్​ ఫస్ట్​ సినిమా ఏంటో తెలుసా? - నయనతార తొలి సినిమా

Nayanthara Birthday Special : స్టార్ హీరోయిన్ నయనతార.. సినీ కెరీర్, పర్సనల్ లైఫ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం.

nayanthara birthday special
nayanthara birthday special

By ETV Bharat Telugu Team

Published : Nov 18, 2023, 8:10 AM IST

Updated : Nov 18, 2023, 12:29 PM IST

Nayanthara Birthday Special :సౌత్​ లేడీ సూపర్​స్టార్ నయనతార.. రీసెంట్​గా 'జవాన్' సినిమాలో మెరిసింది. దీంతో ఆమె బాలీవుడ్​లోనూ తన మార్క్ చూపించింది. అయితే ఒకప్పుడు మలయాళ ఛానెల్​లో ఒక యాంకర్​గా పనిచేసిన నయన్.. ప్రస్తుత టాప్​ హీరోయిన్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది.

నయనతార అసలు పేరు డయానా మరియన్ కురియమ్. కెరీర్​ ప్రారంభంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్న ఆమె.. ఇండస్ట్రీలో నిలదొక్కుకోడానికి చాలా కష్టపడింది. 'మనసినక్కరే' సినిమాతో 2003లో అరంగేట్రం చేసిందీ ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ సినిమా డైరెక్టర్ సత్యన్.. ఆమెకు నయనతార అని స్ట్రీన్​నేమ్ ఇచ్చారు. తర్వాత ఇదే పేరును ఆమె కంటిన్యూ చేసింది. కానీ, ఈ సినిమా పెద్దగా విజయం సాధించకపోవడం వల్ల.. ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు.

కెరీర్​లో ఎత్తుపల్లాలు ఉన్న సమయంలో నయనతారకు డైరెక్టర్ మురుగదాస్.. 'గజిని' సినిమా ఛాన్స్ ఇచ్చారు. ఈ సినిమాలో నయన్ సెకండ్ హీరోయిన్​గా కనిపించింది. అంతే ఆమె లైఫ్ అక్కడి నుంచి మంచి టర్న్ తీసుకుంది. ఈ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ 'చంద్రముఖి' తోపాటు.. తెలుగులో 'బాస్', 'యోగి', 'లక్ష్మి', 'తులసి', 'దుబాయ్ శీను', 'సింహ', 'గ్రీకువీరుడు', 'అదుర్స్​' ఇలా సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. అంతేకాకుండా 'డోరా', 'కర్తవ్యం', 'ఐరా' ఇలా లేడి ఓరియెంటేటెడ్ సినిమాల్లోనూ రాణించి నటిగా సక్సెస్​ అయ్యింది. తెలుగులో రీసెంట్​గా మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో నటించింది.

వివాహం.. తమిళ స్టార్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్​ను గతేడాది ప్రేమవివాహం చేసుకుందీ అమ్మడు. ఈ దంపతులకు ఉయిర్, ఉలగ్ అనే ఇద్దరు కవలపిల్లలున్నారు. వీరి ఫొటోలను అప్పుడప్పుడు నయన్ భర్త విఘ్నెశ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు.

Iravan Movie : రీసెంట్​గా నయనతార 'ఇరైవన్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినమాలో జయం రవితో జతకట్టింది. దర్శకుడు అహ్మద్ తెరకెక్కించారు. ఈ సినిమాలో నటులు చార్లి, రాహుల్ బోస్, ఆశిష్ విద్యార్థి తదితరులు నటించారు. తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజైన ఈ సినిమా మిక్స్​డ్ టాక్​ సొంతం చేసుకుంది.

Jawan Shahrukh : 'జవాన్' విషయంలో నయన్​ అప్సెట్​.. ఇక హిందీ చిత్రాలు బంద్​!.. అసలేం జరిగిందంటే?

'నయన్​తో ప్రేమ అలా మొదలైంది.. 'మేడమ్​'తో అప్పుడే లవ్​లో పడిపోయా'

Last Updated : Nov 18, 2023, 12:29 PM IST

ABOUT THE AUTHOR

...view details