ప్రముఖ నటి నయనతార కష్టాల్లో పడింది. ఇటీవల సరోగసీ ద్వారా నయన్, విఘ్నేశ్ శివన్ దంపతులు కవల పిల్లలకు జన్మనిచ్చారు. అయితే సరోగసీ విధానంలో పిల్లల్ని కనడం నిబంధనలకు లోబడే జరిగిందా అనే సందేహాలు తలెత్తాయి. దీంతో చాలా మంది ఈ జంటను ప్రశ్నించారు. ఈ విషయం ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఎమ్ సుబ్రమణియన్ దాకా వెళ్లింది. స్పందించిన మంత్రి రాష్ట్ర ఆరోగ్య విభాగం జాయింట్ డైరక్టర్ అధ్యక్షతన నలుగురు సభ్యులతో దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేశారు.
అయితే తాజాగా ఈ విషయమై విలేకర్లు అడిగిన ప్రశ్నలకు సుబ్రమణియన్ స్పందించారు. నయన్, విఘ్నేశ్ శివన్‌లు కవల పిల్లలకు సరోగసీ ద్వారా జన్మనిచ్చిన ఆస్పత్రిని దర్యాప్తు బృందం కనుక్కుందని తెలిపారు. ఈ విషయంపై ఎవరూ ఫిర్యాదు చేయలేదని.. ఈ కేసును సుమోటోగా తీసుకుని విచారిస్తున్నామని ఆరోగ్య విభాగం జాయింట్ డైరక్టర్ ఏ విశ్వనాథన్ పేర్కొన్నారు.