తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఘనంగా నయన్- విఘ్నేశ్​ పెళ్లి.. వేడుకలో రజనీ,షారుక్​ సందడి - నయనతార విఘ్నేశ్​ పెళ్లి ఫొటోలు

కోలీవుడ్‌ లవ్‌బర్డ్స్‌ హీరోయిన్​ నయనతార-దర్శకుడు విఘ్నేశ్​ పెళ్లి ఘనంగా జరిగింది. ఈ వేడుకకు బాలీవుడ్​ బాద్​షా షారుక్​ ఖాన్ సహా పలువురు ప్రముఖులు విచ్చేసి నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారని తెలిసింది. సామాజిక ఈ వేడుకకు సంబంధించి కొన్ని ఫొటోలు వైరల్​ అయ్యాయి.

nayantara vignesh marriage
నయన విఘ్నేశ్​ పెళ్లి

By

Published : Jun 9, 2022, 12:29 PM IST

Updated : Jun 9, 2022, 3:05 PM IST

ఎట్టకేలకు కోలీవుడ్‌ లవ్‌బర్డ్స్‌ హీరోయిన్​ నయనతార-దర్శకుడు విఘ్నేశ్​ పెళ్లి ఘనంగా జరిగింది. సన్నిహితులు, కుటుంబసభ్యుల మధ్య మహాబలిపురంలోని షెరిటన్‌ హోటల్‌లో హిందూ సంప్రదాయం ప్రకారం వీరి పెళ్లి వేడుకలు జరిగాయి. ఈ వేడుకలో పలువురు సెలబ్రిటీలు కూడా మెరిశారు. సూపర్​స్టార్​ రజనీకాంత్, హీరో కార్తి,​ బాలీవుడ్​ బాద్​షా షారుక్​ ఖాన్​, దర్శకుడు అట్లీ, నిర్మాత బోనీకపూర్​, మణిరత్నం కూడా హాజరై సందడి చేశారని తెలిసింది. సోషల్​మీడియాలో వీరి ఫొటోలు వైరల్​గా మారాయి. రజనీకాంత్​ కారు దిగి లోపలికి వెళ్తున్న ఫొటో ఒకటి బయటికి రాగా.. షారుక్ క్రీమ్​ కలర్​ షూట్​, వైట్​ షర్ట్ ధరించి స్టైలిష్​ లుక్​లో దర్శనం ఇచ్చారు. ఈ ఫొటోను షారుక్​ మేనేజర్​ పూజా దద్దాని షేర్​ చేశారు.

నయన్- విఘ్నేశ్​

ఇక ఈ పెళ్లిలో కోలీవుడ్ స్టార్​ హీరోలు అజిత్​, విజయ్​తో పాటు టాలీవుడ్​, శాండల్​వుడ్​కు చెందిన సినీ సెలబ్రిటీలు హాజరైనట్లు సమాచారం. మరోవైపు తమ జీవితాల్లో ప్రత్యేకమైన ఈ రోజుని పురస్కరించుకుని తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా లక్షమందితోపాటు 1800 మంది చిన్నారులకు భోజనం అందజేయాలని ఈ జంట నిర్ణయించుకుందట. ఈ మేరకు అభిమాన బృందాలతో కలిసి ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

రజనీకాంత్​
షారుక్​ ఖాన్​

కాగా, పెళ్లికి కాసేపు ముందు విఘ్నేశ్.. నయన్​కు ఉద్దేశిస్తూ​ ఓ ఎమోషనల్​ పోస్ట్ చేశారు. "ఈ రోజు జూన్‌ 9 అంటే ఈరోజు నయన్‌ డే. భగవంతుడు, విశ్వం, నా జీవితంలోని ప్రతిఒక్కరి ఆశీస్సులకు ధన్యవాదాలు..!! మంచి వ్యక్తులు, సమయాలు, అనుకోని మధుర సంఘటనలు, ఆశీస్సులు, షూటింగ్‌ రోజులు, దేవుడి ప్రార్థనలు.. నా జీవితం ఇంత అందంగా ఉండటానికి ఇవే కారణం. ఇక ఇప్పుడు లవ్‌ ఆఫ్‌ మై లైఫ్‌ నయన్‌కు దీన్ని అంకితం చేస్తున్నాను. మై తంగమై.. నువ్వు పెళ్లి కుమార్తెగా ముస్తాబై వేదికపైకి రావడాన్ని చూసేందుకు ఎంతో ఉత్సాహంగా ఉన్నా. కుటుంబసభ్యులు, స్నేహితుల సమక్షంలో జీవితంలోని కొత్త అంకాన్ని ప్రారంభించేందుకు ఆనందంగా ఉన్నారు" అని విఘ్నేశ్‌ శివన్‌ పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ వైరల్‌గా మారింది. అది చూసిన సినీ తారలు నూతన జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

షారుక్​ అట్లీ

ప్రేమ కథ అలా మొదలైంది.. అది 2015. నయనతార, విఘ్నేశ్‌ మధ్య 'నానుమ్‌ రౌడీ ధాన్‌' అనే సినిమా కథా చర్చలు జరుగుతున్న రోజులు. ఓ విధంగా ఈ సినిమా స్క్రిప్టే వారి పరిచయానికి ‘క్లాప్‌’కొట్టింది. ఫస్ట్‌ మీటింగ్‌లోనే ఒకరిపై మరొకరికి సదాభిప్రాయం కలిగింది. అదే స్క్రిప్టు ఆ తర్వాత వారి ప్రేమకు ‘దర్శకత్వం’ వహించి, దారి చూపింది. సంబంధిత ఫొటోలు అప్పట్లో నెట్టింట వైరల్‌గా మారినా ఈ జంట స్పందించలేదు. ఈ సినిమా విడుదలకు ముందు చిత్ర బృందం ప్రెస్‌మీట్‌ నిర్వహించగా.. నయన్‌, విఘ్నేశ్‌ సెట్స్‌లో గంటలుతరబడి మాట్లాడుకుంటూనే ఉండేవారని ఈ ప్రాజెక్టులో నటించిన మన్సూర్‌ అలీఖాన్‌ చెప్పడం అందరి దృష్టినీ ఆకర్షించింది.

కార్తి

అవార్డుల వేడుకతో అర్థమైంది..రెండేళ్ల తర్వాత అంటే 2017లో ఈ జంట సింగపూర్‌లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంలో తళుక్కున మెరిసింది. ఆ అవార్డుల వేడుకలో పక్కపక్కనే వీరిద్దరు కనిపించి, తాము ప్రేమలో ఉన్నామనే హింట్‌ ఇచ్చారు. తమ కాంబినేషన్‌లో వచ్చిన 'నానుమ్‌ రౌడీ ధాన్‌'కిగానూ ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి అవార్డులు వరించాయి. అదే వేదికపై ఒకరికొకరు కృతజ్ఞతలు చెప్పుకున్నారు. విఘ్నేశ్‌ మరో అడుగు ముందుకేసి ‘నయనతార మంచి నటే కాదు మంచి మనసున్న మనిషి’ అని తన మనసులో బయటపెట్టారు. వేడుకలోనే కాకుండా అక్కడి విమానాశ్రయంలోనూ వీరిద్దరు జంటగా కనిపించారు.

మణిరత్నం

అభిమానులతో అన్నీ పంచుకుంటూ..తమ ప్రేమ విషయం అందరికీ తెలియటంతో సోషల్‌ మీడియా వేదికగా ఫొటోలు పంచుకోవడం ప్రారంభించారు విఘ్నేశ్‌. నయనతారకు సామాజిక మాధ్యమాల ఖాతాలు లేకపోవడంతో అన్ని విశేషాలను ఆయనే పంచుకుంటున్నారు. పుట్టినరోజు వేడుకల నుంచి తాము దర్శించుకున్న ఆలయాల వివరాల వరకు అన్నింటినీ షేర్‌ చేస్తూ "పెళ్లి ఎప్పుడు చేసుకుంటారో" అని చాలామందిలో ఆసక్తిని పెంచారు.

బోనీకపూర్

ఇంటర్వ్యూలో ఖరారైంది..2021 మార్చి 25న విఘ్నేశ్‌ పోస్ట్‌ చేసిన ఓ ఫొటో అభిమానుల సందేహాలకు తెర దించినట్టైంది. ఆ ఫొటోలో నయనతార వేలికి ఉంగరం కనిపించటంతో వారి నిశ్చితార్థం అయిందనే వార్తలు చక్కర్లు కొట్టాయి. అదే ఏడాది ఆగస్టులో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నయనతార ఆ కథనాల్లో వాస్తవం ఉందని వెల్లడించింది.

నయనతార

సినిమాల సంగతి..నయన్‌, విఘ్నేశ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన రెండో చిత్రం 'కాతువాకుల రెండు కాదల్‌'. సమంత, విజయ్‌ సేతుపతి కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా ఇటీవల విడుదలైంది. విఘ్నేశ్‌ త్వరలోనే మరో సినిమాను పట్టాలెక్కించబోతున్నారు. నయనతార నటించిన 'O2' చిత్రం ఈ నెల 17న డిస్నీ+ హాట్‌స్టార్‌లో విడుదలకానుంది. ఆమె నటించిన మలయాళ చిత్రం 'గోల్డ్' ఈ ఏడాది ఆగస్టులో వస్తుంది. హిందీలో షారుఖ్‌ ఖాన్‌ సరసన 'జవాన్‌', తెలుగులో చిరంజీవితో 'గాడ్‌ ఫాదర్‌' సినిమాల్లో నయన్‌ నటిస్తోంది.

ఇదీ చూడండి: నా మనసు దోచిన హీరో అతడే!: నమిత

Last Updated : Jun 9, 2022, 3:05 PM IST

ABOUT THE AUTHOR

...view details