Nayantara-Vignesh marriage wedding card: నయనతార-విఘ్నేశ్ శివన్ పెళ్లికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరో ఒక్క రోజులో(జూన్ 9) వీరిద్దరు మూడు ముళ్ల బంధంతో ఒకట్టి కానున్నారు. ఈ వివాహ వేడుకకు మహాబలిపురం వేదిక కానుంది. అత్యంత సన్నిహితుల మధ్య ఈ వేడుక జరగనుంది.
నయన్-విఘ్నేశ్ వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో వైరల్ - నయనతార విఘ్నేశ్ శుభలేఖ
Nayantara-Vignesh marriage wedding card: నయనతార-విఘ్నేశ్ శివన్ వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో నెట్టింట వైరల్గా మారింది. దాన్ని నెటిజన్లు ట్రెండ్ చేస్తున్నారు. మీరు చూసేయండి..
అయితే తాజాగా నయన్-విఘ్నేశ్ వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఈ యానిమేటేడ్ వీడియోలో వధువు, వరుడు తమిళ సాంప్రదాయ దుస్తులు ధరించి కలిసి నడుస్తున్నట్లుగా చూపించారు. ఇందులో నయనతార, విఘ్నేష్ తల్లిదండ్రుల పేర్లు, పెళ్లి తేది, జరిగే సమయం, వేదికను పొందుపర్చారు. ఇదిలా ఉంటే పెళ్లి జరిగే మహాబలిపురంలోని రిసార్ట్లో ఇప్పటికే భద్రత ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. ఈ వేడుకకు వచ్చే అతిథులందరూ ప్రత్యేక డ్రెస్ కోడ్లో హాజరుకానున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి: అది జరిగితే.. నా పెళ్లి గురించి చెబుతా: కార్తిక్ ఆర్యన్