తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

నయనతార సరోగసీ వివాదం.. స్పందించిన విఘ్నేశ్​! - నయనతార విఘ్నేశ్​ సరోగసి

సరోగసి పద్ధతి ద్వారా పిల్లల్ని కనడంపై పరోక్షంగా స్పందించారు దర్శకుడు విఘ్నేశ్​. ఏమన్నారంటే..

Nayantara vignesh gave clarity on Surrogacy
నయనతార సరోగసీ వివాదం

By

Published : Oct 12, 2022, 12:11 PM IST

Updated : Oct 12, 2022, 12:42 PM IST

నయనతార-విఘ్నేశ్​ దంపతులు కవల పిల్లలకు తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. తమకు ఇద్దరు మగ పిల్లలు(కవలలు) జన్మించారంటూ ఇటీవలే సోషల్​మీడియా ద్వారా తెలిపారు. అయితే దీనిపై పెద్ద చర్చే జరుగుతోంది. ఎందుకంటే వీరికి పెళ్లై ఇంకా నాలుగు నెలలే అవుతోంది. అందులోనూ వీరు సరోగసి ద్వారా తల్లిదండ్రులు అయ్యారు. దీంతో వారిద్దరిపై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. అలాగే తమకు పిల్లలు ఎలా పుట్టారో వివరణ ఇవ్వాలంటూ తమిళనాడు ప్రభుత్వం నయన్ దంపతులకు నోటీసులు జారీ చేసింది. దీనిపై ఇప్పటివరకు ఈ జంట స్పందించలేదు.

అయితే తాజాగా విఘ్నేష్ శివన్ తన ఇన్​స్టాలో షేర్ చేసిన పోస్ట్​ ఒకటి వైరల్​ అవుతోంది. ఇందులో 'అన్ని విషయాలు సరైన సమయంలో మీకు తెలుస్తాయి. అప్పటివరకు ఓపికపట్టండి. ఎప్పుడూ కృతజ్ఞతతో ఉండండి' అని అందులో రాశారు. ఇప్పుడీ పోస్ట్​ నెట్టింట వైరలవుతోంది. సరోగసి విధానం ద్వారా తల్లిదండ్రులుగా మారిన నయన్ దంపతులు ఈ విషయం పై నేరుగా స్పందించకుండా ఇలా పరోక్షంగా స్పందించారని నెటిజన్లు భావిస్తున్నారు.

విఘ్నేశ్ పోస్ట్​

కాగా, సుమారు ఏడేళ్ల నుంచి ప్రేమలో ఉన్న ఈ జంట కుటుంబసభ్యుల సమక్షంలో మహాబలిపురంలో జూన్‌ 9న పెళ్లి బంధంతో ఏకమయ్యింది. మహాబలిపురంలో అంబరాన్ని అంటేలా ఓ సుందరమైన పెళ్లి వేదికలో జరిగిన ఈ కళ్యాణ వేడుక డాక్యుమెంటరీ రూపంలో త్వరలోనే నెట్టింట్లో సందడి చేయనుంది. 'నయనతార: బియాండ్‌ ది ఫెయిరీటేల్' అనే టైటిల్​తో ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది. ఇక దసరాకు విడుదలైన 'గాడ్‌ ఫాదర్‌'తో విజయాన్ని అందుకున్న నయన్​. 'కాతువాకుల రెండు కాదల్'’తో ఈ ఏడాది ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు విఘ్నేశ్‌తో తదుపరి అజిత్‌ సరసన ఓ సినిమా చేయనున్నారని ఇటీవలే ప్రకటించారు.

Last Updated : Oct 12, 2022, 12:42 PM IST

ABOUT THE AUTHOR

...view details