ఇందులో.. అందమైన నగరం.. ఆ సిటీలో ఓ చిన్న కుటుంబం.. ఎలాంటి చింతలు లేకుండా సంతోషంగా సాగుతోన్న వారి జీవితాలు లాక్‌డౌన్ కారణంగా ఛిద్రమయ్యాయి. వైద్యుడైన తండ్రి కరోనా విధుల్లో భాగంగా ఆస్పత్రికే పరిమితం కావడం, తల్లి వర్క్ ఫ్రమ్ హోమ్‌లో బిజీగా ఉండటంతో ఆ ఇంటి అమ్మాయి స్పిరిట్ గేమ్ ఆడి ఇంటిల్లిపాదిని ప్రమాదంలోకి నెట్టేసింది. ఇంతకీ ఆ అమ్మాయి స్పిరిట్ గేమ్ ఎందుకు ఆడింది? ఆ అమ్మాయి ఒంట్లోకి ప్రవేశించిన ఆత్మను బయటకు పంపించేందుకు ఇంట్లోవాళ్లు ఏం చేశారు? ఇలాంటి ఆసక్తికర అంశాలతో రూపుదిద్దుకున్న చిత్రమే 'కనెక్ట్'. ఇందులో లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్ర పోషించారు. అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రౌడీ పిక్చర్స్ బ్యానర్‌పై నయన్ స్వయంగా నిర్మించింది. తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ట్రైలర్‌ను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ విడుదల చేశారు.
అర్ధరాత్రి నయనతారను భయపెట్టిన డెవిల్.. వీడియో పోస్ట్ చేసిన ప్రభాస్ - నయనతార కనెక్ట్ రిలీజ్ డేట్
లేడీ సూపర్ స్టార్ నయనతారను ఓ డెవిల్ బాగా భయపెట్టేసింది! ఆ వీడియోను ప్రభాస్ పోస్ట్ చేశారు.
వివాహం తర్వాత నయనతార ప్రధాన పాత్రలో నటించిన చిత్రమిది. సత్యరాజ్, అనుపమ్ ఖేర్ కీలకపాత్రలు పోషించారు. ఇందులో తల్లిగా నయన్ నటన ఆకట్టుకునేలా ఉంది. ఆత్మలతో మాట్లాడాలనే ఆసక్తి ఉన్న అమ్మాయిగా నాఫియా అదరగొట్టేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ నెట్టింట సినీ ప్రియులను ఆకట్టుకుంటోంది. హాలీవుడ్‌లో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్లను తలపించేలా ట్రైలర్ ఉందని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. డిసెంబర్ 22న ఇది విడుదల కానుంది.
ఇదీ చూడండి:భర్తతో కలిసి హాలిడేను ఎంజాయ్ చేస్తున్న మౌనీరాయ్ ఫొటో షూట్లతో బిజీబిజీగా జాన్వీ