బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రధాన పాత్రలో తెరకెకుతున్న చిత్రం 'హడ్డీ'. అక్షత్ అజయ్ శర్మ దర్శకుడు. ఈ సినిమాలో ఆయన ట్రాన్స్ జెండర్ పాత్రలో కనిపించనున్నారు. జీ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మిస్తోంది.
అయితే ఈ చిత్రంలోని ట్రాన్స్‌జెండర్ లుక్ కోసం నవాజుద్దీన్ సిద్ధిఖీ తీవ్రంగా శ్రమించారు. దాదాపు మూడు గంటల పాటు మేకప్ కోసం కేటాయించారు. గతంలోనే దీనికి సంబంధించిన పోస్టర్ విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఆ లుక్ కోసం ఎంతో సేపు పట్టిందో తెలియజేస్తూ ఓ మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది మూవీటీమ్. ట్రాన్స్‌జెండర్ మేకప్ కోసం నవాజుద్దీన్ సిద్ధిఖీ తన కుర్చీకి దాదాపు మూడు గంటల పాటు అతుక్కుపోయారని పేర్కొంది.