తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Naveen Polishetty Twitter Video : నవీన్‌ పొలిశెట్టి నా అన్వేషణ.. భలే ఇమిటేట్​ చేశారుగా! - నవీన్‌ పొలిశెట్టి ట్విట్టర్​ వీడియో

Naveen Polishetty Twitter Video : టాలీవుడ్ హీరో నవీన్‌ పొలిశెట్టి తాజాగా సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను షేర్​ చేశారు. అందులో నా అన్వేషణ అనే యూట్యూబర్​ను నవీన్‌ ఇమిటేట్ చేసి కడుబపుబ్బా నవ్వించారు. ఆ వీడియో మీరూ చూడండి.

Naveen Polishetty latest twitter post
Naveen Polishetty latest twitter post

By ETV Bharat Telugu Team

Published : Oct 15, 2023, 7:04 PM IST

Naveen Polishetty Twitter Video :టాలీవుడ్​ హీరో నవీన్‌ పొలిశెట్టి ప్రస్తుతం 'మిస్​ శెట్టి మిస్టర్​ పొలిశెట్టి' సక్సెస్​ను ఆస్వాదిస్తున్నారు. సినిమా రిలీజ్​కు ముందు ప్రమోషన్స్​లో యాక్టివ్​గా ఉన్న ఆయన.. మూవీ రిలీజ్​ తర్వాత కూడా సక్సెస్​ మీట్స్​లో పాల్గొంటూ బిజీ బిజీగా ఉన్నారు. ఇక సోషల్ మీడియా వేదికగా ఆడియెన్స్​కు థ్యాంక్స్​ చెప్పిన నవీన్‌ .. తాజాగా ఓ డిఫరెంట్​ కాన్సెప్ట్​తో వీడియోను చేని దాన్ని ట్విట్టర్​ వేదికగా పోస్ట్​ చేశారు.

'మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి' ప్రమోషన్స్‌లో భాగంగా తెలుగు ట్రావెలర్‌ నా అన్వేషణ అనే యూట్యూబ్​ ఛానల్​కు చెందిన అన్వేష్‌ను ఇమిటేట్‌ చేశారు. అన్వేష్​లాగా ఉత్తరాంధ్ర యాసలో మాట్లాడిన నవీన్‌.. ప్రతిఒక్కరూ 'మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి' చూడాలంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా వేదికగా తెగ ట్రెండ్ అవుతోంది. నవీన్‌ ఇమిటేషన్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Naa Anveshana Youtube : యూట్యూబ్​లో కొన్ని లక్షల మంది ఫాలోయర్స్ ఉన్న 'అన్వేష్ చిన్ని' అనే వ్యక్తి ప్రపంచం మొత్తం చక్కర్లు కొడుతూ అక్కడి పద్ధతులు, ఆహారపు అలవాట్లకు సంబంధించిన వీడియోలను చేస్తుంటారు. ఆయన మాటలు, విషయాన్ని చెప్పే విధానం చాలా వెరైటీగా ఉంటాయి. ఇక అన్వేష్​ని అచ్చుగుద్దినట్టు ఇమిటేట్​ చేసి.. నవీన్ ఇప్పుడు ఫ్యాన్స్​ను కడుపుబ్బా నవ్వించారు.

Miss Shetty Mr Polishetty Cast : ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. నవీన్‌ పొలిశెట్టి, అనుష్క శెట్టి లీడ్​ రోల్స్​లో తెరకెక్కిన ఈ సినిమాకు మహేశ్‌బాబు దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై నిర్మితమైన ఈ చిత్రం. సెప్టెంబర్‌ నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్​ షేక్ చేసింది. ఇందులో జయసుధ, అభినవ్ గోమటం, మురళీ శర్మ, తులసి, సోనియా దీప్తిలు ఇతర కీలక పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

Miss Shetty Mr Polishetty Review : సినిమా రివ్యూ విషయానికొస్తే.. కథా నేపథ్యం, నవీన్, అనుష్క నటన, వినోదం, భావోద్వేగాలు సినిమాకు ప్లస్​గా నిలిచాయి. ఆరంభ సన్నివేశాలు, నెమ్మదిగా సాగే కథనం సినిమాకు మైనస్ అని చెప్పవచ్చు. చివరిగా ఒక్కమాటలో చెప్పాలంటే.. శెట్టి - పొలిశెట్టి నవ్విస్తూ మదిని బరువెక్కించారు. సినిమాలో నవీన్‌ పొలిశెట్టి, అనుష్కతో పాటు జయసుధ, మురళీ శర్మ, తులసి, అభినవ్‌ గోమఠం, సోనియా దీప్తి, హర్షవర్ధన్, భద్రమ్‌ తదితరులు నటించారు. రధన్‌ సంగీతం అందించారు. గోపీసుందర్‌.. నేపథ్య సంగీతం, నీరవ్‌ షా.. ఛాయాగ్రహణం అందించారు. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్​పై సినిమాను నిర్మించారు.

Miss shetty Mr polishetty Collections : లాభాలతో దూసుకెళ్తున్న 'మిస్ శెట్టి'.. హాఫ్ సెంచరీ కొట్టిన 'మార్క్ ఆంటోనీ'!

Miss Shetty Mr Polishetty Review : సినిమాపై మెగాస్టార్​ చిరంజీవి ట్విట్టర్​ రివ్యూ.. ఏమని పోస్ట్ చేశారంటే?

ABOUT THE AUTHOR

...view details