Naveen Polishetty Sreeleela Movie : నవీన్ పోలిశెట్టి.. ఆన్ స్క్రీన్ లేదా ఆఫ్ స్క్రీన్‌లో కామెడీ చేస్తూ నవ్వులు పూయిస్తుంటాడు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతిరత్నాలు వంటి చిత్రాలతో విజయాలనందుకున్న ఆయన ఆ తర్వాత రీసెంట్గా మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టితో హ్యాట్రిక్ సక్సెస్ అందుకున్నారు. తన కొత్త సినిమాలను త్వరలోనే పట్టాలెక్కించనున్నారు.
ప్రస్తుతం మిస్ శెట్టి సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న ఆయన ఎప్పుడో 2012లోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2019లో ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ చిత్రంతో హీరోగా మారారు. ఆ తర్వాత అదే ఏడాది హిందీ చిత్రం ఛిచోరేలోనూ నటించి ఆకట్టుకున్నారు. ఆ తర్వాత రెండేళ్ల పాటు గ్యాప్ ఇచ్చిన ఆయన జాతిరత్నాలుతో బిగ్గెస్ట్ సక్సెస్ ఖాతాలో వేసుకున్నారు. అనంతరం మళ్లీ రెండేళ్ల పాటు విరామం తీసుకుని ఇప్పుడు మిస్ శెట్టితో ప్రేక్షకుల్ని అలరించారు. ఈ మూడు చిత్రాలు ఫన్ నేపథ్యంలో వచ్చి హిట్ అందుకోవడం విశేషం. ఇప్పుడు తాజా విజయంతో నవీన్‌కు డిమాండ్ పెరిగే అవకాశం ఉంది.
తాజాగా నవీన్ కూడా ప్రస్తుతం తన చేతిలో మరో మూడు చిత్రాలు ఉన్నట్లు తెలిపారు.వాటి స్క్పిప్ట్స్ లాక్ అయినట్లు పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఈ మూడు చిత్రాలు ఒక్కొక్కటిగా సెట్స్ మీదకు వెళ్తాయని క్లారిటీ ఇచ్చారు. అన్నారు. హిందీలో రెండు మూడు కథలు విన్నట్లు కూడా చెప్పుకొచ్చారు. ఈ లాక్ అయిన స్క్రిప్ట్ల్ లో ఒకటి మైత్రి మూవీస్ బ్యానర్లో అని సదరు నిర్మాణ సంస్థ చేసిన ట్వీట్‌తో అర్థమైపోయింది. ఆ మధ్యలో షైన్ స్క్రీన్‌తో పాటు నిర్మాత దిల్ రాజుతో ఓ సినిమా, జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్తోనూ సినిమాలు ఉంటాయని ప్రచారం సాగింది. అంటే వచ్చే ఏడాది నవీన్ మరింత బిజీగా మారనున్నారు.