తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

అదే నా జీవితంలో చేదు జ్ఞాపకం: నాని - నాని అంటే సుందరానికీ సాంగ్స్​

Nani antey sundaraniki movie: పక్కింటి అబ్బాయిలా.. చూడగానే పలకరించాలనిపించే నటుడు నాని. ఆయన తాజాగా నటించిన చిత్రం 'అంటే... సుందరానికీ'. ఈ చిత్రంతో సరికొత్త లుక్‌లో అలరించడానికి సిద్ధమైన నాని జీవితంలోని కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం..

Nani antey sundaraniki
నాని అంటే సందరానికీ!

By

Published : Jun 5, 2022, 8:52 AM IST

Nani antey sundaraniki movie: నేచురల్ స్టార్​ నాని నటించిన కొత్త చిత్రం 'అంటే సుందరానికీ'. ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో నాని గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీ కోసం..

అదే చిత్రం.. చదువుకునే రోజుల్లో అన్ని సబ్జెక్టుల్లో కంటే ఇంగ్లిషులోనే ఎక్కువ మార్కులొచ్చేవి. నిజానికి అప్పట్లో నాకు ఇంగ్లిష్‌ సరిగా రాదు. పరీక్షల్లో ప్రతీ ప్రశ్నకూ 'టైటానిక్‌' కథ రాసేవాణ్ని. దానికేనేమో మార్కులు బాగా పడిపోయేవి.

ప్రత్యేకం.. మా అబ్బాయికి ఊహ తెలిశాక థియేటర్‌లో చూపించిన సినిమా 'శ్యామ్‌ సింగరాయ్‌'. తెర మీద నన్ను చూడగానే షాక్‌ అయ్యాడు. 'రోజూ ఇంట్లో ఉండే నాన్న ఇంత పెద్ద టీవీలో కనిపిస్తున్నాడేంటీ..? ఇంత మంది అలా చూస్తూ అరుస్తున్నారేంటీ" అని ఆశ్చర్యపోయాడు. వాడు అలా చూడటం, అడగడం నాకు ఎప్పటికీ ప్రత్యేకంగా అనిపిస్తుంది.

దొరికిపోయా.. చిన్నప్పుడు అమ్మని ఐస్‌క్రీమ్‌ అడిగితే 'తినకూడదు, ఎలాంటి నీళ్లతో తయారు చేస్తారో'నని ఇప్పించలేదు. దాంతో ఎవరూ చూడకుండా అమ్మ పర్సులో నుంచి ఐదురూపాయలు కొట్టేసి ఐస్‌క్రీమ్‌ కొనుక్కున్నా. మిగిలిన మూడు రూపాయల చిల్లరను పర్సులో పెడుతూ అమ్మకి దొరికిపోయా. బాగా కోప్పడింది.

నేనే పెట్టేశా.. నేను చదువుల్లో తోపేమీ కాదు. ఒకసారి అన్ని సబ్జెక్టుల్లోనూ తప్పా. నాన్న చూస్తే ఎక్కడ కంగారుపడిపోతారోనని ఆయనకి చూపించకుండానే నేనే ప్రోగ్రెస్‌ కార్డులో సంతకం పెట్టా. అలా చేయడం అదే మొదలూ చివరా కూడా. అందుకు చాలా గిల్టీగానూ ఫీలయ్యా.

ఎవరికీ తెలియంది..కులు మనాలీలో 'ఎవడే సుబ్రమణ్యం' షూటింగ్‌ 42 రోజులు జరిగింది. ఆ సమయంలో నేను స్నానం చేసింది రెండేసార్లు. స్నానం టాపిక్‌ వస్తే ఎప్పుడూ నాకు ఆ షూటింగే గుర్తొస్తుంది. ఇక అమితాబ్‌, విద్యాబాలన్‌ల నటన చాలా ఇష్టం. అవకాశమొస్తే వాళ్లతో ఒక్క సీన్‌లోనైనా నటించాలనుంది.

స్లిప్పులు పెట్టా... చదువుకునేటప్పుడు పరీక్షలంటే బాగా భయపడేవాడిని. అందుకే పరీక్షలప్పుడు షూస్‌లో స్లిప్పులు పెట్టుకెళ్లేవాడిని. రెండుమూడుసార్లు దొరికిపోయా కూడా. లక్కీగా డిబార్‌ అవ్వలేదు. 'నేను లోకల్‌'లోని అలాంటి కొన్ని సీన్లు నా జీవితంలో జరిగినవే.

స్ఫూర్తి.. 'దళపతి' సినిమా అంటే నాకు పిచ్చి. రజనీకాంత్‌, మమ్ముట్టీల యాక్షన్‌ సూపర్‌. అది చూసే నేను సినిమాల్లోకి రావాలనుకున్నా. ఇప్పటికీ వీలు కుదిరితే ఆ సినిమా చూస్తుంటా. నాకు బీఎమ్‌డబ్ల్యూ కారు అంటే ఎంతిష్టమో. ఆ ఇష్టంతోనే మా అబ్బాయికి కారు గురించి బోలెడు విషయాలు చెబుతుంటా.

అలా అనుకున్నాడు.. ఇంట్లో వద్దన్నా స్నేహితులతో కలిసి రామ్‌గోపాల్‌ వర్మ 'దెయ్యం' సినిమాకి వెళ్లా. కాసేపు చూసేసరికి ఓ రేంజ్‌లో భయమేసింది. ఒళ్లంతా చెమటలు. మరోవైపు వణుకుతో చేతిలో ఉన్న కూల్‌డ్రింక్‌ ఒలికిపోయి ప్యాంట్‌ తడిసిపోయింది. నా ఫ్రెండేమో భయంతో తడిపేసుకున్నానని పొరబడ్డాడు.

సినిమాల్లోకి రాకపోయుంటే.. నేను సినీరంగంలోకి రాకపోయి ఉంటే థియేటర్‌లో టికెట్‌ కలెక్టర్ని అయి ఉండేవాణ్ని. ప్రతిరోజూ ప్రతి షో ఫ్రీగా చూసేయొచ్చు కదా. తేడాది ‘అంటే... సుందరానికీ’ షూటింగ్‌ న్యూయార్క్‌లో సున్నా డిగ్రీల చలిలో జరిగింది. ఆ సమయంలో కోట్‌ కూడా లేకుండా మామూలు షర్టు వేసుకునే- పైగా బాడీ ఫ్రీజ్‌ అయిపోయేలా ఉన్నా అది తెలియకుండా చాలా సహజంగా నటించాల్సి వచ్చింది. అందుకోసం చాలా కష్టపడ్డా. ఇక నా జీవితంలో చేదు జ్ఞాపకం.. ఇంటర్‌లో ఉన్నప్పుడు ఓ ఫ్రెండ్‌ చేసిన తప్పుకి నేను లాఠీ దెబ్బలు తినడం.

ఇదీ చూడండి:'‘అంటే సుందరానికీ’లో అది ఉంది.. ప్రేక్షకులు తప్పకుండా థియేటర్​కి వస్తారు'

ABOUT THE AUTHOR

...view details