తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

సుకుమార్​పై కాంట్రవర్సీ కామెంట్స్​.. వివరణ ఇచ్చిన నాని - కాంట్రవర్సీపై నాని స్పందన

'దసరా' సినిమా ప్రమోషన్స్​లో భాగంగా తనపై వచ్చిన కాంట్రవర్సీల గురించి మాట్లాడారు నేచురల్ స్టార్ నాని. ఆ సంగతులు..

nani reacts on controversy comments
కాంట్రవర్సీ కామెంట్స్​పై స్పందించిన నాని.. సమస్య అవుతుందంటూ..

By

Published : Mar 24, 2023, 10:20 PM IST

గత కొద్ది కాలంగా నేచురల్ స్టార్ నాని చేసిన కామంట్స్​ కాంట్రవర్సీకి దారి తీస్తున్న సంగతి తెలిసిందే. అవి సోషల్​మీడియాలో హాట్​టాపిక్​గా మారుతున్నాయి. దీనిపై ఆయన విమర్శలు కూడా ఎదుర్కొంటున్నారు. అయితే తాజాగా 'దసరా' మూవీ ప్రమోషన్స్​లో పాల్గొన్న ఆయన.. తనపై వచ్చిన వివాదాల గురించి నాని స్పందించారు. ఓ బాలీవుడ్​ మీడియాతో ఈ విషయాల్ని చర్చించారు. తాను ఏం మాట్లాడినా అది సమస్యగా మారుతోందని ఆయన పేర్కొన్నారు. గతంలో తాను టికెట్‌ రేట్స్​ విషయమై తన అభిప్రాయాన్ని చెప్పినందుకు వార్తల్లో ఎక్కిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. అలాగే దర్శకుడు సుకుమార్​ను తాను తక్కువ చేసి మాట్లాడినట్టు వస్తున్న వార్తలపై కూడా మాట్లాడారు. సుకుమార్‌ అంటే తనకెంతో గౌరవం ఉందని.. తక్కువ చేసే మాట్లాడాలనే ఉద్దేశం తనకు లేదని చెప్పుకొచ్చారు.

'చిన్న విషయానికే పెద్ద సమస్యల్లో చిక్కుకున్నారా?' అని ఓ మీడియా ప్రతినిధి అడగగా.. "అవును. సమస్యలను ఫేస్ చేశాను. నేను చెప్పిన చిన్న చిన్న వ్యాఖ్యలే పెద్ద సమస్యలను తీసుకువచ్చాయి. ఆ విషయాల గురించి ఇప్పుడు మాట్లాడితే అది ఇంకొక సమస్యను తెచ్చి పెడుతుంది. 'శ్యామ్‌ సింగరాయ్‌' సినిమా సమయంలో టికెట్‌ రేట్స్​ గురించి నా అభిప్రాయాన్ని వ్యక్తం చేశాను. ఆ తర్వాత అది పెద్ద సమస్యగా మారిపోయింది. నేను ఏం మాట్లాడినా.. దాన్ని ఎదుటివాళ్లు మరోలా అర్థం చేసుకుంటున్నారు. 'అలా ఎందుకు మాట్లాడుతున్నారు?' అంటూ నాపై కామెంట్స్‌ చేస్తున్నారు. ఎదుటి వ్యక్తులను తక్కువ చేసేలా, కించపరిచేలా.. అసభ్యపదజాలాన్ని ఉపయోగించడం లేదు. తప్పుడు వ్యాఖ్యలను అనలేదు. కేవలం నా ఉద్దేశాన్ని మాత్రం చెబుతున్నాను." అని అన్నారు.

"రీసెంట్​గా దర్శకుడు సుకుమార్‌ విషయంలో కూడా ఇదే జరిగింది. ఇలా చర్చనీయాంశం అయ్యేలా.. నేను మాట్లాడలేదు. 'దసరా' ప్రమోషన్స్‌లో భాగంగా నేనొక మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్నాను. అక్కడ ఓ విలేకరి.. 'ప్రతి ఒక్కరూ బడా డైరెక్టర్స్​తో పాన్‌ ఇండియా సినిమాలు చేస్తున్నారు. మరి మీరెందుకు ఇలా కొత్త డైరెక్టర్స్​తో చేస్తున్నారు." అని ప్రశ్నించారు. దానికి నేను.. "కొంతమంది డైరెక్టర్స్​కు మన దగ్గర క్రేజ్​ ఉన్నప్పటికీ వేరే సినీ ఇండస్ట్రీవాళ్లకు.. వాళ్లు కొత్తే కదా. సుకుమార్‌కు తెలుగులో మంచి పేరు ఉంది. కానీ 'పుష్ప' తర్వాతే ఆయన వేరే చోట్ల పాపులారిటీని దక్కించుకున్నారు. నా డైరెక్టర్​ ఇప్పుడు అన్ని ఇండస్ట్రీలకు కొత్త వాడే అయినా తర్వాత మంచి పేరు దక్కించుకోవచ్చు" అంటూ నా డైరెక్టర్​కు మద్దతు చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశాను. కాకపోతే, వాటిని తప్పుగా అర్థం చేసుకుని ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతూ కామెంట్స్‌ చేస్తున్నారు" అని నాని తన వివాదాల గురించి వివరించారు.

ఇదీ చూడండి:Rangamarthanda: 'ఇకపై నా సినీ జీవితం అలా ఉంటుందని అనుకుంటున్నా'

ABOUT THE AUTHOR

...view details