నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ 'దసరా' బాక్సాఫీస్ వద్ద రెండో రోజూ కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. ఈ రెండు రోజుల్లో హిట్ టాక్‌తో పాటు కలెక్షన్ల పరంగా సంచలనాలను సృష్టిస్తోంది. తొలి రోజే రూ.38 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసిన ఈ మూవీ.. రెండో రోజు దాదాపు రూ.15 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. రెండు రోజుల్లో మొత్తం రూ.53 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు చిత్రబృందం తెలిపింది. ఇక ఈ సినిమా రెండో రోజు కలెక్షన్లను ఓ సారి చూస్తే..
- నైజాం - రూ.10.26 కోట్లు
- సీడెడ్ - రూ. 3.02 కోట్లు
- ఉత్తరాంధ్ర - రూ. 2.06 కోట్లు
- తూర్పు గోదావరి - రూ. 1.18 కోట్లు
- పశ్చిమ గోదావరి - రూ. 71 లక్షలు
- కృష్ణా - రూ. 92 లక్షలు
- గుంటూరు - రూ. 1.46 కోట్లు
- నెల్లూరు - రూ. 47 లక్షలు
రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు రూ.20.08 కోట్లను కలెక్ట్ చేసింది. గ్రాస్‌గా సుమారు రూ.34.45 కోట్లకు మేర సంపాదించిందని ట్రేడ్ వర్గాల టాక్. ఓవర్‌సీస్‌లో ఈ మూవీ రూ.5.60 కోట్లు షేర్ కలెక్షన్లను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ.29.08 కోట్లు షేర్ కలెక్షన్స్ వచ్చాయి. గ్రాస్ ప్రకారం చూస్తే రూ.52.40 కోట్లు వసూలైందని సమాచారం.