నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన కొత్త చిత్రం 'దసరా'. నూతన దర్శకుడు ఓదెల శ్రీకాంత్ తెరకెక్కిస్తున్నారు. కీర్తి సురేశ్ కథానాయిక. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో మార్చి 30 ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో తెలుగు టీజర్‌ను దర్శకుడు రాజమౌళి విడుదల చేశారు. ఈర్లపల్లి చుట్టూర బొగ్గు కుప్పలు.. మందంటే మాకు వ్యసనం కాదు.. అలవాటు పడిన సంప్రదాయం అంటూ సాగే పక్కా పల్లెటూరి మాస్ డైలాగ్స్‌తో ప్రారంభమైంది టీజర్. నీయవ్వ.. ఎట్టైతె గట్లే గుండు గుత్తగా లేపేద్దాం.. బాంచెన్ అంటూ పక్కా తెలంగాణ యాసలో డైలాగ్స్ చెబుతూ నాని అదరగొట్టేశారు. బొగ్గుగని బ్యాక్ డ్రాప్‌లో సాగే ఎలిమెంట్స్‌తో పక్కా మాస్ ఎంటర్టైనర్లా దసరా ఉండబోతుందని టీజర్‌తో చెప్పేశాడు దర్శకుడు.
సాయికుమార్, సముద్రఖని, పలువురు ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. పక్కా తెలంగాణ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణన్ స్వరాలు సమకూరుస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో మార్చి 30న థియేటర్లలో విడుదల కానుందీ చిత్రం. కొద్ది రోజుల కిందటే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ దశలోనే అదిరిపోయే బిజినెస్‌ను సొంతం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దాదాపు రూ.100 కోట్ల బిజినెస్ జరిగిందని టాక్ వినిపిస్తోంది.