తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'దసరా' జోరు.. ఎన్టీఆర్​ రికార్డును బ్రేక్​ చేసిన నాని! - నాని ఓవర్సీస్​ సినిమా కలెక్షన్స్​

'దసరా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నేచురల్ స్టార్ నాని... యంగ్​ టైగర్​ జూనియర్ ఎన్టీఆర్ రికార్డును బ్రేక్ చేశారు. ఆ వివరాలు..

Natural Star Nani breaks NTR Record
'దసరా' జోరు.. ఎన్టీఆర్​ రికార్డును బ్రేక్​ చేసిన నాని

By

Published : Apr 1, 2023, 6:09 PM IST

నేచురల్ స్టార్ నాని నటించిన 'దసరా' సినిమా పాన్​ ఇండియా స్థాయిలో బాక్సాఫీస్​ వద్ద హిట్​ టాక్​తో దూసుకెళ్తోంది. మంచి వసూళ్లను అందుకుంటోంది. రెండు రోజుల్లోనే రూ.50కోట్లకు పైగా వసూళ్లను అందుకుంది. దీంతో సినీ ప్రేక్షకులు థియేటర్లలో సినిమా చూసేందుకు క్యూ కడుతున్నారు. ఎక్కడ చూసిన హౌస్​ ఫుల్​ బోర్డులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓవర్సీస్​లోనూ ఓ రికార్డును సాధించారు. జూనియర్ ఎన్టీఆర్​ రికార్డును బ్రేక్ చేశారు.

అదేంటంటే.. వాస్తవానికి హీరో నానికి 'జెర్సీ' సినిమా తర్వాత సరైన హిట్ పడలేదు. 'గ్యాంగ్ లీడర్'​, 'వి', 'టక్ జగదీశ్'​, 'శ్యామ్​ సింగ రాయ్'​, 'అంటే సుందరానికీ' భారీ హిట్లను అందుకోలేదు. వీటిలో కొన్ని డిజాస్టర్​గా కూడా నిలిచాయి. అయినప్పటికీ ఆయనే మిడియం రేంజ్​ హీరోల్లో నెంబర్​ 1గా కొనసాగుతున్నారు. అలానే మరోవైపు ఓవర్సీస్ మార్కెట్ కలెక్షన్స్​ విషయంలోనూ స్టార్ హీరోలతో పోటీ పడుతున్నారు. ఏకంగా టాప్​-3లోకి దూసుకొచ్చేశారు. ప్రస్తుతం ఓవర్సీస్ మార్కెట్​ కలెక్షన్స్​ పరంగా.. ఆయన ఖాతాలో ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 8 సినిమాలు.. 1 మిలియన్ మార్క్​ను అందుకున్నాయి.

తాజాగా ఆయన నుంచి వచ్చిన దసరా చిత్రం కూడా కలెక్షన్లలో 1 మిలినయ్ మార్క్​కు అందుకుంది. ఇప్పటికే ఏడు సార్లు ఈ రేర్ ఫీట్​ను అందుకున్న నాని తాజా చిత్రంతో ఎనిమిదో సారి కూడా ఆ ఘనతను అందుకున్నారు. గతంలో నాని నటించిన 'ఈగ', 'నేను లోకల్', 'భలే భలే మగాడివోయ్', 'ఎంసీఏ', 'నిన్ను కోరి', 'జెర్సీ', 'అంటే సుందరానికీ!' చిత్రాలు 1 మిలియన్ మార్క్​ను దక్కించుకున్నాయి. ఈ ఘనతతో.. టాలీవుడ్ నుంచి ఎక్కువ 1 మిలియన్ డాలర్ల సినిమాలు అందించిన రెండో హీరోగా నాని నిలిచారు. నాని కన్నా ముందు స్థానంలో మహేశ్​ బాబు 11 సినిమాలతో ఉన్నారు. ఆయన తర్వాత నాని-ఎన్టీఆర్​ 7 చిత్రాలతో సమానంగా ఉండేవారు. ఇప్పుడు ఎన్టీఆర్​ను వెనక్కి నెట్టి రెండో స్థానంలో ఒక్కడే కొనసాగుతున్నారు.

ఇకపోతే ఎన్టీఆర్-కొరటాల కాంబినేషన్​లో రూపొందుతున్న NTR 30 సినిమా కూడా కచ్చితంగా ఓవర్సీస్​లో 1 మిలియన్ దక్కించుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ సినిమా సమయంలోనే నాని మరో రెండు చిత్రాలు చేస్తే అవి కూడా ఈ ఘనతను అందుకోవచ్చు. ఈ విధంగా చూస్తే.. నాని రికార్డును బ్రేక్​ చేయడానికి ఎన్టీఆర్​ మరింత సమయం పట్టొచ్చు. అలానే త్రివిక్రమ్ చిత్రం తర్వాత.. మహేశ్-రాజమౌళి సినిమా కూడా ఆలస్యం అయితే నాని అగ్రస్థానానికి వెళ్లిపోవచ్చు.

ఇదీ చూడండి:నానికి ఇప్పుడే అసలు సినిమా మొదలైందిగా.. మరి ఏం చేస్తాడో?

ABOUT THE AUTHOR

...view details