ఇటీవలే 'దసరా' సినిమా షూటింగ్ కంప్లీట్ చేసిన నేచురల్ స్టార్ నాని ఆ సినిమాలో మునుపెన్నడు లేని రఫ్ లుక్‌లో కనిపించాడు. ఇక షూట్ కంప్లీటయ్యింది కదా మన నాని ఇప్పుడు ఏ సినిమాతో అలరించనున్నాడని ఆతృతగా ఎదురుచూసిన ఫ్యాన్స్ కోసం తన 30 సినిమా అప్డేట్ను ప్రకటించాడు. నాని 30 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా అప్డేట్ను కూడా విన్నూత్నంగా ఓ వీడియో రూపంలో తెలిపాడు నేచురల్ స్టార్. అంతే కాకుండా ఇటీవలే తన న్యూ లుక్‌తో ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరిచాడు.
త్వరలో సెట్స్‌పైకి ఎక్కనున్న నాని 30వ సినిమా.. - నాని 30 మూవీలో మృణాల్ ఠాకూర్
తన నేచురల్ యాక్టింగ్‌తో అందరి చేత నేచురల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న నాని తాజాగా తన 30వ సినిమా అప్డేట్ను ప్రకటించాడు. ఇటీవలే తన కొత్త లుక్‌తో ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరిచగా.. నాని 30 మూవీ టీమ్ ఓ కొత్త అప్డేట్తో ముందుకొచ్చింది.
ఇందులో నాని..ఓ చిన్నారితో మాట్లాడుతూ సినిమాలోని తన లుక్‌తో పాటు ఎంటైర్ టీమ్ గురించి తెలియజేస్తాడు. అయితే ఆ గ్లింప్స్ చూసిన ఫ్యాన్స్ సినిమా అప్డేట్కు ఎమెషనల్‌గా కనెక్టయ్యారు. జెర్సీ సినిమాలో నాన్న పాత్ర పోషించిన నాని అందులో తండ్రి కొడుకుల రిలేషన్‌షిప్‌ను కళ్లకు కట్టినట్టు చూపించాడు. ఇక ఈ సినిమాలో చిన్నారితో కూడా అదే తరహా అనుబంధాన్ని చూడగలమంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఎప్పుడూ కొత్త డైరక్టర్లతో పని చేసేందుకు ఇష్టపడే నేచురల్ స్టార్..తన కెరీర్‌లోని 30వ సినిమాకు కూడా కొత్త దర్శకుడినే ఎంచుకున్నాడు. అలా శౌర్యువ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వైరా ఎంటర్టైనమెంట్స్ తెరకెక్కిస్తున్న చిత్రాన్ని జనవరి 31న పూజా కార్యక్రమాలతో సెట్స్‌పైకి తీసుకురానున్నట్లు మూవీ టీమ్ ప్రకటించింది. కాగా ఈ మూవీలో నాని సరసన మృణాల్ ఠాకూర్ నటించగా యంగ్ మ్యూజిక్ డైరక్టర్ హేషమ్ అబ్దుల్ వహాబ్ మ్యూజిక్ అందించనున్నారు.