తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'షూటింగ్​లు ఆపేసి మీరేం న్యాయం చేశారు?.. ఫిల్మ్ ​ఛాంబర్​ సమాధానం చెప్పాల్సిందే!'

క్యూబ్‌, మల్టీప్లెక్స్‌ల్లో సినిమాల ప్రదర్శన చిన్న చిత్రాల నిర్మాతలకు భారమవుతోందని నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌, ఎగ్జిబిటర్‌ నట్టికుమార్‌ అన్నారు. సినిమాల చిత్రీకరణలు నిలిపివేసి, చిన్న నిర్మాతలకు ఏం న్యాయం చేశారో ఆలోచించాలని ఫిల్మ్​ ఛాంబర్​ ఆయన లేఖ రాస్తూ పలు అంశాలను ప్రస్తావించారు.

natti-kumar-wrote-a-letter-to-telugu-film-chamber
natti-kumar-wrote-a-letter-to-telugu-film-chamber

By

Published : Oct 12, 2022, 6:27 AM IST

క్యూబ్‌, యూఎఫ్‌ఓ తదితర డిజిటల్‌ ప్రొవైడర్ల ఛార్జీలు చిన్న సినిమాల పాలిట శాపంగా మారాయని నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌, ఎగ్జిబిటర్‌ నట్టి కుమార్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల సినిమాల చిత్రీకరణలు నిలిపివేసి, చిన్న నిర్మాతలకు ఏం న్యాయం చేశారో ఆలోచించాలని తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడు, కార్యదర్శికి ఆయన లేఖ రాశారు.

"క్యూబ్‌, మల్టీప్లెక్స్‌ల్లో (పీవీఆర్‌ తదితర) ఒక్క షో వేసినా, ఏడు షోలు ప్రదర్శించినా రూ. 9,800 చెల్లించాల్సి వస్తుంది. చిన్న సినిమాలకూ ఇది వర్తిస్తుంది. 'సినీ పొలిస్‌'లో అయితే రూ. 7,080 చెల్లించాలి. ఇంత మొత్తం చెల్లించటం చిన్న సినిమా నిర్మాతలకు తీవ్ర భారంగా మారిన విషయం నిజం కాదా? మల్టీప్లెక్స్‌ల్లో 35 టికెట్లు అమ్ముడుపోనిదే సినిమాలను ప్రదర్శించరు. ఒకవేళ అంతమంది ప్రేక్షకులు రాకపోతే ఎవరికీ చెప్పకుండా సినిమా తీసేస్తారు. సినిమాల చిత్రీకరణను నిలిపేసి 30 రోజులపాటు మీరు చేసిందేంటి? చిన్న సినిమాల నిర్మాతల సమస్యలు ఎప్పుడు తీరుతాయి?"

-- లేఖలో నట్టి కుమార్​

"ఫెడరేషన్‌లోని వారికి చిన్న సినిమాల చిత్రీకరణలకు సంబంధించి 25 శాతం ధరలు తగ్గిస్తామని 10 సంవత్సరాలుగా మోసం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో చిన్న నిర్మాతలకు 15 శాతం రేట్లు పెంచారు. వారికి మీరేం న్యాయం చేసినట్టో ఒక్కసారి ఆలోచించండి. థియేటర్స్, క్యాంటీన్‌లకు సంబంధించిన ధరలు తగ్గుతాయని, చిన్న సినిమాలకు అన్నీ వరాలే అని సెక్టార్ ఛైర్మన్ సురేందర్ రెడ్డి, మోహన్ గౌడ్ , రామసత్యనారాయణ తదితరులు అన్నారు. ప్యాషన్‌ ఉన్న కొంతమంది చిన్న సినిమా నిర్మాతలు సమస్యలు అధిగమించి, ఎదురు డబ్బులిచ్చీ మరీ తమ సినిమాలను విడుదల చేస్తున్నారు. కానీ, సినిమానే ప్రాణంగా జీవిస్తున్న నిర్మాతలు తమ చిత్రాలను రిలీజ్ చేసే పరిస్థితుల్లో లేరు. ఛాంబర్ పెద్దలు వీటన్నింటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. సమాధానం ఇస్తారని ఆశిస్తున్నా" అని నట్టి కుమార్‌ లేఖలో పేర్కొన్నారు.

ఇవీ చదవండి:పవన్ కల్యాణ్ ఇండస్ట్రీలోకి వచ్చి 26 ఏళ్లు.. కానీ వాళ్లు గుర్తుపట్టలేదు!

'ఆర్​సీ-15' నుంచి మరో అప్డేట్.. క్రేజీ లుక్​లో రామ్​ చరణ్!

ABOUT THE AUTHOR

...view details