National Film Awards Prize Money : భారతీయ సినీ పరిశ్రమ.. జాతీయ చలన చిత్ర అవార్డులను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తుంది. ఈ అవార్డును అందుకోవాలని సినీ రంగంలో ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఏటా ప్రకటించే ఈ అవార్డుల కోసం చాలా మంది ఎదురుచూస్తుంటారు. తాజాగా 2021 ఏడాదికి గాను 69వ జాతీయ చలన చిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశ వ్యాప్తంగా పలు చిత్రాలు, నటీనటులు, టెక్నీషియన్లు ఈ అవార్డులకు ఎంపిక అయ్యారు.
National Film Award Allu Arjun : గతంలో ఎప్పుడూ లేనంతగా.. జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో తెలుగు చిత్రాలు.. ఏకంగా 10 అవార్డులను దక్కించుకుని ఔరా అనిపించాయి. ఆస్కార్ వేదికపై రెండు అవార్డులు దక్కించుకున్న ఆర్ఆర్ఆర్ ఆరు విభాగాల్లో అవార్డులను కొల్లగొట్టింది. అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికై సత్తా చాటారు. 69 ఏళ్ల చరిత్రలో ఏ తెలుగు నటుడిగా దక్కని అరుదైన గౌరవాన్ని ఆయన దక్కించుకున్నారు. అయితే ఈ అవార్డు గ్రహీతలకు కేంద్ర ప్రభుత్వం ఏమేం ఇస్తుందోనని నెటిజన్లు, అభిమానులు తెగ వెతుకుతున్నారు. మరి అవార్డు గ్రహీతలకు ఏం ప్రదానం చేస్తారంటే?
National Film Awards Winners Prizes : జాతీయ చలనచిత్ర ఈ అవార్డు విజేతలకు స్వర్ణ కమలం, రజత కమలంతో పాటు నగదు బహుమతి, ప్రశంసా పత్రాలు అందిస్తారు. అయితే, జ్యూరీ అభినందించిన చిత్రాలకు మాత్రం కేవలం సర్టిఫికేట్ మాత్రమే అందిస్తారు. జ్యూరీ స్పెషల్ విజేతలకు నగదు బహుమతి అందిస్తారు.
- ఉత్తమ నటుడు, ఉత్తమ నటి సహా ఇతర అవార్డులు అందుకున్న నటీనటులు, టెక్నీషియన్లకు రూ.50 వేల నగదు బహుమతితో పాటు రజత కమలాన్ని అందిస్తారు.
- 2021 ఏడాదికి గాను.. ఉత్తమ నటుడిగా అవార్డుకు ఎంపికైన అల్లు అర్జున్, ఉత్తమ నటీమణులుగా ఎంపికైన అలియా భట్, కృతి సనన్ రూ.50 వేల నగదుతో పాటు రజత కమలాన్ని అందుకుంటారు.
- బెస్ట్ డైరెక్టర్‌గా జాతీయ అవార్డు గెలుచుకున్న నిఖిల్ మహాజన్ రూ.2.50 లక్షల నగదు బహుమతి, రజత కమలం పొందుతారు.
- బెస్ట్ మూవీగా ఎంపికైన రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్ మూవీకి రూ.2.50 లక్షల నగదుతో పాటు స్వర్ణ కమలాన్ని అందజేయనున్నారు.
- ఉత్తమ వినోద చిత్రంగా అవార్డుకు ఎంపికైన RRR.. రూ. 2 లక్షల నగదుతో పాటు స్వర్ణ కమలం దక్కించుకోనుంది.
- జ్యూరీ స్పెషల్ అవార్డుకు ఎంపికైన షేర్షా మూవీ రూ.2 లక్షల నగదుతో పాటు రజత కమలం పొందనుంది
- ఉత్తమ జాతీయ సమగ్రత చిత్రంగా ఎంపికైన ది కశ్మీర్ ఫైల్స్‌కు రూ. 1.50 లక్షల నగదు, రజత కమలం అందజేయనున్నారు.