National Film Awards 2023 :2021కి గాను కేంద్రం ఇటీవలే జాతీయ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులోభాగంగా69వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం నేడు(అక్టోబర్ 17)న రాష్ట్రపతి భవన్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఇందులో అల్లు అర్జున్, కృతి సనన్, ఆలియా భట్, రాజమౌళి, కీరవాణి, దేవీశ్రీ ప్రసాద్ లాంటి స్టార్స్ హాజరై అవార్డులను అందుకున్నారు. వీరితో పాటు పలువురు దర్శక నిర్మాతలు, సాంకేతిక నిపుణులు వివిధ కేటగిరీల్లో అవార్డులను అందుకున్నారు.
National Awards Winning Movies : మరోవైపు ఉప్పెన, కొండపొలం, పుష్ప, ఆర్ఆర్ఆర్ సినిమాల ద్వారా టాలీవుడ్‌కు అవార్డుల పంట పండింది. దీంతో తెలుగు ఇండస్ట్రీలో సంబరాలు మొదలయ్యాయి. ఇక అవార్డు గ్రహీతలు కూడా మీడియాతో తమ ఆనందాన్ని పంచుకున్నారు. దీన్ని చూసిన ఫ్యాన్స్ తమ అభిమాన తారలను నెట్టింట అభినందనలు తెలుపుతున్నారు.
National Film Awards 2021 : సినిమా రంగంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన నటీనటులు, సాంకేతిక బృందానికి వివిధ కేటగిరీల్లో ఈ అవార్డులు దక్కాయి. 31 విభాగాల్లో ఫీచర్ ఫిల్స్మ్‌కు, 24 విభాగాల్లో నాన్ ఫీచర్ ఫిల్మ్స్‌కు, 3 విభాగాల్లో రచనా విభాగానికి అవార్డులు ప్రకటించారు. 2021 సంవత్సరానికి 281 ఫీచర్ ఫిల్మ్‌లు వివిధ విభాగాల్లో ఈసారి జాతీయ అవార్డుల కోసం స్క్రూటినీకి వచ్చినట్లు జ్యూరీ కమిటీ ప్రకటించింది. ఈ క్రమంలో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డును 'రాకెట్రీ ద నంబీ ఎఫెక్ట్' సినిమా దక్కించుకోగా.. ఉత్తమ నటుడిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఉత్తమ నటిగా ఆలియా భట్, కృతిసనన్ అందుకున్నారు.