తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

National Awards Reactions : పుష్ప టీమ్ ఎమోషనల్.. 'నేషనల్'​ విన్నర్స్​కు సెలబ్రిటీల స్పెషల్​ విషెస్​ - నేషనల్ అవార్డ్స్​ విన్నర్స్​కు సెలబ్రిటీల విషెస్​

National Awards Reactions : ప్రతిష్టాత్మక నేషనల్ అవార్డులు ప్రకటించిన వేళ సినీ ఇండస్ట్రీలో సంబరాలు మొదలయ్యాయి. సుమారు 31 విభాగాల్లో ఫీచర్‌ ఫిల్స్మ్‌కు, 24 విభాగాల్లో నాన్‌ ఫీచర్‌ ఫిల్మ్స్‌కు, 3 విభాగాల్లో రచనా విభాగానికి అవార్డులు ప్రకటించారు. ఈ క్రమంలో అవార్డు విన్నర్స్​తో పాటు వారి ఫ్యాన్స్ సంబరాలు చేసుకోగా.. పలువురు సినీ ప్రముఖులు, సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా నేషనల్ అవార్డ్స్​ విన్నర్స్​కు విషెస్​ తెలుపుతున్నారు. ఆ విశేషాలు మీ కోసం..

National Awards Reactions
National Awards Reactions

By ETV Bharat Telugu Team

Published : Aug 24, 2023, 7:46 PM IST

Updated : Aug 25, 2023, 10:05 AM IST

National Awards Reactions :2021 ఏడాదికి గానూ చలనచిత్ర జాతీయ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో 69వ జాతీయ అవార్డులను జ్యూరీ సభ్యులు గురువారం దిల్లీలో ప్రకటించారు. జాతీయ ఉత్తమ నటుడి అవార్డు ఐకాన్​ స్టార్​ అల్లు అర్జున్​ను వరించింది. సుకుమార్​ దర్శకత్వంలో తెరకెక్కిన 'పుష్ప-1' సినిమాకు గాను ఆయన ఈ అవార్డుకు ఎంపికయ్యారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ నెట్టింట​ సంబరాలు చేసుకుంటున్నారు. ట్విట్టర్​ వేదికగా బెస్ట్ యాక్టర్​ అనే ట్యాగ్​ను ట్రెండ్​ చేస్తున్నారు. అంతే కాకుండా అల్లు అర్జున్‌ నివాసం వద్దకు చేరుకుని సందడి చేశారు. పుష్ప టీమ్​ బన్నీ ఇంటికి చేరుకుని ఆయన్ను అభినందించారు. ఇక 'పుష్ప' దర్శకుడు సుకుమార్​ అయితే అల్లు అర్జున్​ను హత్తుకుని భావోద్వేగానికి లోనయ్యారు. మరోవైపు సినీ ప్రముఖులు, సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా నేషనల్ అవార్డ్స్​ విన్నర్స్​కు విషెస్​ తెలుపుతున్నారు.

Chiranjeevi Wishes To National Award Winners : "69వ జాతీయ చలన చిత్ర అవార్డు విజేతలందరికీ శుభాకాంక్షలు. తెలుగు సినిమాకి గర్వకారణమైన రోజిది. నా ప్రియమైన బన్నీ (అల్లు అర్జున్‌)కి హృదయపూర్వక అభినందనలు. గౌరవనీయమైన జాతీయ ఉత్తమ నటుడు అవార్డు సాధించినందుకు గర్వపడుతున్నా. అలాగే ఆరు జాతీయ అవార్డులు గెలుచుకున్న 'ఆర్‌ఆర్‌ఆర్‌' బృందానికి, రెండు పురస్కారాలు సాధించిన 'పుష్ప' టీమ్​కు.. ఒక్కో అవార్డు దక్కించుకున్న 'ఉప్పెన', 'కొండపొలం' చిత్ర బృందాలకు శుభాకాంక్షలు".

Jr NTR Congratulates National Awards Winners : "అభినందనలు అల్లు అర్జున్‌ బావ. 'పుష్ప' కోసం పొందే అన్ని విజయాలు, అవార్డులకు మీరు అన్ని విధాల అర్హులు. అలాగే నా 'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్ర బృందం మొత్తానికి శుభాకాంక్షలు. కీరవాణి గారూ మీరు మా చిత్రానికి అందించిన నేపథ్య సంగీతం అత్యుత్తమం. ఈ అవార్డు దానికి మరో గుర్తింపు. ప్రేమ్‌ మాస్టర్‌.. మా శరీరంలోని ప్రతి ఎముక, కండరం మీకు ఈ అవార్డును సాధించి పెట్టాయి. కాలభైరవ..'కొమురం భీముడో' పాటకు నీ స్వరంతో జీవం పోశావు. శ్రీనివాస్‌ మోహన్‌, కింగ్‌ సోలమన్‌ మీరు తప్పు పట్టలేని వారు. 'ఆర్‌ఆర్‌ఆర్‌' వంటి గుర్తుండిపోయే చిత్రాన్ని ఇచ్చిన రాజమౌళి, డీవీవీ దానయ్యకు కృతజ్ఞతలు. జాతీయ పురస్కారాలు గెలుచుకున్న అలియా భట్‌, దేవిశ్రీ ప్రసాద్‌, చంద్రబోస్‌తో పాటు ‘ఉప్పెన’ చిత్ర బృందానికి అభినందనలు’’.

Last Updated : Aug 25, 2023, 10:05 AM IST

ABOUT THE AUTHOR

...view details